Site icon NTV Telugu

Salaar: ప్రశాంత్ నీల్ ధైర్యం ప్రభాస్…

Salaar B

Salaar B

ఈ మధ్య టయర్ 2 హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసినా, రీజనల్ సినిమాలు చేసినా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. తమ సినిమాని ఎంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ రీచ్ వస్తుంది, అంత బుకింగ్స్ వస్తాయి అనే మేకర్స్ హీరోలు, దర్శకుల ఆలోచన. ఇన్స్టా మోడల్స్ తో రీల్స్ చేసే దగ్గర నుంచి ప్రతి సాంగ్ కి ప్రమోషనల్ ఈవెంట్ చేసి మరీ పాటలు వదులుతూ… టీజర్ లాంచ్ కి ఒక ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కి ఒక ఈవెంట్… ప్రీరిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్, పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ, సక్సస్ టూర్లు… ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సినిమా నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేయాలన్నా కూడా ఒక ఈవెంట్ చేస్తున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఒక్క ఈవెంట్ చేయకుండా, ఒక ఇంటర్వ్యూ ఇవ్వకుండా సినిమాని పాన్ ఇండియ మాట్లాడుకునే చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

KGF టైమ్ లో ఇండియా మొత్తం తిరిగి సినిమాని పబ్లిసిటీ చేసిన ప్రశాంత్ నీల్… ఇప్పుడు సలార్ సినిమాని మాత్రం కేవలం రెండు ట్రైలర్స్ తోనే ఇండియా మొత్తం తిరిగి చూసేలా చేసాడు. ప్రభాస్ గట్టిగా రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో చూపించి, ఆ కటౌట్ కి న్యాయం చేయడంతో సలార్ ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇండియా మొత్తం తిరగలేదు, ఇన్స్టా మోడల్స్ తో రీల్స్ చేయించలేదు, అన్నేసి ఈవెంట్స్ చెయ్యలేదు… ఇవేమీ చేయకపోయినా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి రీచ్ వస్తుంది, సరైన కంటెంట్ ని రిలీజ్ చేస్తే అదే అతిపెద్ద పబ్లిసిటీ అని డైరెకర్ అండ్ మేకర్స్ నమ్మారు, క్వాలిటీ అవుట్ పుట్ ని చూపించారు. అందుకే సలార్ ప్రమోషనల్ ఈవెంట్స్ లేకపోయినా బజ్ ఉంది, ప్రభాస్ బయట కనిపించకపోయినా హైప్ ఉంది. ఈ హైప్ రేంజ్ ఏంటో డిసెంబర్ 22న ఇండియా మొత్తం చూడబోతుంది.

Exit mobile version