శుక్రవారం అంటే సినీ అభిమానులకి పండగరోజే. కొత్త సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్లడం చాలా మంది ఆడియన్స్ షెడ్యూల్ లో భాగం అయిపోయి ఉంటుంది. అయితే కొత్త పండగ రోజు పాత బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీక్ టాలీవుడ్ పరిస్థితి కూడా అలానే ఉంది. పెద్ద సినిమాలు లేవు, బజ్ క్రియేట్ చేసిన సినిమాలు లేవు, థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించే హీరోలు లేరు. దీంతో ఈ శుక్రవారం చప్పగా సాగే అవకాశం ఉంది. లాస్ట్ వీక్ అడవి శేష్ నటించిన ‘హిట్ 2’ సినిమా ఆడియన్స్ ని బాగా మెప్పించింది. ఈ వీక్ లో ‘గుర్తుందా శీతాకాలం’, ‘విజయానంద్’, ‘ముఖచిత్రం’, ‘పంచతంత్రం’, ‘ప్రేమదేశం’, ‘లెహరాయి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.
వీటిలో సత్యదేవ్ నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో ‘తమన్నా’ కూడా నటించడంతో ఈ మూవీకి కాస్త బెటర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. విశ్వక్ సేన్ ఉన్నాడు కాబట్టి ‘ముఖచిత్రం’ సినిమాని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లే అవకాశం ఉంది కానీ ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఎంతసేపు కనిపిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. యాంకర్ స్వాతి కంబ్యాక్ చిత్రంగా రూపొందిన ‘పంచతంత్రం’ సినిమాని పెద్దగా ప్రమోట్ చేయలేదు, ‘విజయానంద్’ సినిమాని బాగానే ప్రమోట్ చేశారు కానీ టాలీవుడ్ లో మాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోయారు. ఇక మిగిలిన ‘ప్రేమదేశం’, ‘లెహరాయి’ సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది సింపుల్ గా చెప్పాలి అంటే ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకి వస్తున్నవే. ఏ మూవీ టాక్ బాగుంటే ఆడియన్స్ ఆ సినిమాకి వెళ్లిపోతారు. మరి వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా ఏ సినిమా గురించి స్ప్రెడ్ అవుతుందో చూడాలి.
