NTV Telugu Site icon

Zendaya: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన స్పైడర్ మాన్ హీరోయిన్… ‘జెండాయ’

Zendaya

Zendaya

స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్,  స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది ‘జెండాయ’. హాలీవుడ్ సూపర్ హీరో టామ్ హాలండ్ తో ప్రేమలో ఉన్న జెండాయ, ఇండియన్ ఎటైర్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం వరల్డ్ సినిమా సెలబ్రిటీస్ ముంబైకి వస్తున్నారు. ఈ ఈవెంట్ ని జెండాయ, టామ్ హాలండ్, లా రోచ్, జిగి హడిద్  అటెండ్ అయ్యారు. ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చినా జెండాయ మాత్రం చాలా స్పెషల్ గా నిలిచింది, ఇందుకు కారణం ఆమె ఇండియన్ ఎటైర్ లో కనిపించడమే.

Read Also: Rashmika: నేషనల్ క్రష్ కూడా లేడీ ఓరియెంటెడ్ చేసేస్తోంది…

భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన బంగారు అలంకారాలతో కూడిన వైలెట్ చీరలో జెండాయా చాలా అందంగా కనిపించింది. దీంతో జెండాయ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. టామ్ కూడా ‘బ్లాక్ టక్స్‌’లో క్లాసీగా ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం అంతర్జాతీయ సెలబ్రిటీలతో పాటు, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, కాజోల్, రేఖ, వరుణ్ ధావన్ మరియు అనన్య పాండే వంటి బాలీవుడ్ తారలు కూడా గ్లామరస్‌గా ఎంట్రీ ఇచ్చారు.

Show comments