Thiruveer: మాసూద హీరోతో జీ5 ‘మిషన్ తషాఫి’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరువీర్… ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటూ విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలతో పాటు ఓటీటీ మాధ్యమంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించి జీ 5 అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రణతి రెడ్డి నిర్మాత.
ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం శరవేగంగా పూర్తవుతుంది. ఇప్పుడు వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ ఈ టీమ్‌లో జాయిన్ కావటంపై మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తిరువీర్ బర్త్ డే సందర్బంగా ‘మిషన్ తషాఫి’లో ఆయన నటిస్తున్నారంటూ జీ 5 అధికారికంగా ప్రకటించింది. తిరువీర్ విలక్షణ నటనతో తన పాత్రను డైరెక్టర్ ఊహించిన దాని కంటే ఇంకా బెటర్ ఔట్ పుట్ ఇస్తారని మేకర్స్ భావిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు వంటి డైరెక్టర్‌తో కలిసి పని చేయటంపై తిరువీర్ సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇండియా లో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ RAW ఏజెంట్స్ కి మధ్య నడిచే బావోద్వేగమైన హై ఇన్‌టెన్స్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇది.
Also Read
- Raaka: 'రాకా'లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
- Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు ఓటీటీలో ఎవరూ నిర్మించని రీతిలో జీ 5 దీన్ని భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను ఫారిన్ లొకేషన్స్‌లో చిత్రీకరించలేదు. కానీ తొలిసారి ‘మిషన్ తషాఫి’ సిరీస్‌ను విదేశాల్లో కూడా చిత్రీకరిస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ నేతృత్వంలో ఫైట్స్‌ను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!