NTV Telugu Site icon

Anjali: కంచెలు ఉన్న ఊరిలోకి ఎంటర్ అవుతుందా?

Anjali

Anjali

తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అవ్వరు, వాళ్లు హీరోయిన్లుగా సెట్ అవ్వరు అనే మాటని పూర్తిగా చెరిపేస్తూ… ‘ఫోటో’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది ‘అంజలి’. ఈ రాజోలు అమ్మాయి తెలుగులో డెబ్యూ ఇచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యింది. సౌత్ లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అవ్వలేరు అనే మాటని పూర్తిగా చెరిపేసింది. ఈ మధ్యలో కాలంలో 50 సినిమాలు చేసిన హీరోయిన్ అతి తక్కువ మంది హీరోయిన్స్ లో అంజలి కూడా ఉంది. ప్రెజెంట్ జనరేషన్ లో సౌత్ ఇండియా నుంచి ఓటీటీలో టాప్ బిజినెస్ చేస్తున్న ఏకైక హీరోయిన్ అంజలి మాత్రమే. సినిమాలు, వెబ్ సీరీస్ లు అనే తేడా లేకుండా నచ్చిన కంటెంట్ ని మాత్రమే చేస్తున్న అంజలి… ఫిల్మ్ ఫేర్, నంది అవార్డ్స్, ఐఫా అవార్డ్స్, నార్వే తమిళ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. ఈరోజు అంజలి పుట్టిన రోజు కావడంతో ఇండస్ట్రీ వర్గాలు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో విషెష్ చెప్తున్నారు. #HappyBirthdayAnjali టాగ్ క్రియేట్ చేసి అంజలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. అంజలి ఫాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ గా, ఆమె నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘బహిష్కరణ’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. గతేడాది అంజలి బర్త్ డే రోజున ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ తో బయటకి వచ్చిన జీ 5 అండ్ పిక్సెల్ పిక్చర్స్… ఈసారి బహిష్కరణ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.

ముఖేష్ ప్రజాపతి అనే కొత్త దర్శకుడు ఈ వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీతేజ్, అనన్య నాగళ్ల, రవీంద్ర విజయ్ లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. జులై మూడో వారంలో కానీ ఆగస్టు ఫస్ట్ వీక్ లో కానీ రిలీజ్ అవ్వనున్న ఈ వెబ్ సీరీస్ ఫస్ట్ లుక్ లో పల్లెటూరి వాతావరణాన్ని చూపించేలా డిజైన్ చేసారు. గతంలో వదిలిన పోస్టర్ లో అంజలి సీరియస్ టోన్ లో కనిపించి, కాస్త గ్లామర్ లుక్ లో ఉంది. ఈసారి మాత్రం అంజలి ట్రంక్ పెట్టె పట్టుకోని ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ లుక్ లో ఉంది.  బ్యాక్ గ్రౌండ్ లో ఎర్ర బస్సు, ఫోర్ గ్రౌండ్ లో కంచెని పెట్టి మేకర్స్ ఈ పోస్టర్ ని డిజైన్ చేసారు. మరి కంచెలు ఉన్న ఊరిలోకి ఎంటర్ అవుతుందా? లేక ఆమెని ఊరి నుంచి బహిష్కరించారా? అనే ప్రశ్నకి సమాధానం తెలియాలి అంటే బహిష్కరణ వెబ్ సీరీస్ రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Show comments