Site icon NTV Telugu

Ram: రామ్ మీద రూపాయి బిజినెస్ ఉండదు.. జనం ఉన్నట్టు బిల్డప్ ఇచ్చా.. వైవీఎస్ చౌదరి షాకింగ్ కామెంట్స్

Yvs Chowdary

Yvs Chowdary

YVS Chowdary Shocking Comments on Ram: తెలుగు చిత్రసీమలో నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈరోజు ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రామ్ గురించి ప్రస్తావన రాగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. రామ్ ను మీరు హీరోగా పరిచయం చేశారు, ఆయన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోనే కదా అని ప్రశ్నించారు. దానికి చౌదరి స్పందిస్తూ రామ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోనే అయితే వాళ్ళ బాబాయి రవికిశోర్ ఆయనతో సినిమా చేయాలి నేనెందుకు చేస్తానని ప్రశ్నించారు.

Vijay Sethupathi: పవన్ కళ్యాణ్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

అంతేకాదు ప్రొడ్యూస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. రామ్ మీద రూపాయి సెలబిలిటీ లేదు. పది కోట్లు పెట్టాను, రిలీజ్ రోజున డబ్బులు పోయాయి అన్నారు. ఆస్తులు అన్నీ స్టేక్ లో ఉన్నాయి. నేను సినిమా శాటిలైట్ రైట్స్ జీ టీవీకి తక్కువ రేటుకు అమ్మి వచ్చిన డబ్బుతో మళ్ళీ పబ్లిసిటీ చేశాను. థియేటర్ల దగ్గర ఆడియన్స్ లేరు. నేను నాలుగు వారాలు థియేటర్ల చుట్టూ తిరిగి నేను థియేటర్లో జనం ఉన్నారు అన్నట్టు మైకులతో మాట్లాడేవాడిని. బ్రహ్మాండంగా ఉన్నారు జనం, నాకు చాలా ఆనందంగా ఉందని జనంతో మాట్లాడుతున్నట్టు మాట్లాడేవాడిని ఇవన్నీ నిజాలు అని ఆయన అన్నారు. నెమ్మదిగా సినిమా పుంజుకుని 175 రోజులు కూడా ఆడిందని ఆయన కామెంట్ చేశారు.

Exit mobile version