Site icon NTV Telugu

Nikhil: ‘స్పై’ ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్… యువసామ్రాట్…

Spy

Spy

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘స్పై’. గ్యారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై సాలిడ్ హైప్ ఉంది. సుభాష్ చంద్ర బోస్ మిస్సింగ్ కేస్ గురించి డిస్కస్ చేస్తుండడంతో స్పై సినిమాపై నార్త్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నిఖిల్ సినిమాకి ఓవర్సీస్ లో ఇప్పటివరకు దొరకిన గ్రాండ్ రిలీజ్ స్పై సినిమాకి లభించింది. అత్యధిక థియేటర్స్ లో స్పై సినిమా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ తో యాక్షన్ తో పాటు దేశభక్తి ఎలిమెంట్స్ ని బాగా చూపించారు. ఈ కారణంగా స్పై సినిమాకి పాన్ ఇండియా రీచ్ లభించింది. ప్రమోషన్స్ స్టార్టింగ్ లో కాస్త సైలెంట్ గా నిఖిల్ కూడా స్పీడ్ పెంచడంతో స్పైకి సాలిడ్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. సౌత్ కన్నా నార్త్ లోనే స్పై సినిమాకి మంచి గిరాకీ ఉండే ఛాన్స్ ఉంది.

ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి లేనంతగా రిలీజ్ కి ముందే ప్రాఫిట్స్ లోకి వెళ్లిపోయిన మూవీ ‘స్పై’ మాత్రమే. రిలీజ్ కి ఇంకా 48 గంటల సమయమే ఉండడంతో మేకర్స్ స్పై ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఈరోజు సాయంత్రం 6:30 నిమిషాలకి స్పై ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా మొదట్లో మెగాస్టార్ చిరంజీవి వస్తాడు అనే మాట వినిపించింది. అయితే మెగాస్టార్ కాకుండా యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘స్పై’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా వస్తున్నాడనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్పై సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ ఏమైనా రిలీజ్ అవుతుందా? ఈ సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేసిన రానా కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అవుతాడా అనేది చూడాలి.

Exit mobile version