NTV Telugu Site icon

YS Bharathi Look: యాత్ర 2 వైఎస్ భారతి లుక్ రిలీజ్.. భలే సూట్ అయిందే!

Ys Bharathi Look

Ys Bharathi Look

YS Bharathi Look from Yatra 2 Movie Released:‘యాత్ర 2’ మూవీలో వైఎస్ భారతి లుక్ ని యాత్ర 2 యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాలో వై.ఎస్.ఆర్‌గా మమ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో జీవా నటిస్తుండగా వైఎస్ భారతీ పాత్రలో కేతిక నారాయన్ నటిస్తోంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘యాత్ర 2’ సినిమా మీద వైఎస్ ఫ్యామిలీ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో వై.ఎస్.భారతీ పాత్ర ఫ‌స్ట్ లుక్‌ను సినిమా యూనిట్ శనివారం విడుదల చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించగా ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తానని అప్పట్లోనే డైలెక్టర్ ప్రకటించారు.

Telangana Assembly: ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు వీరే..

ఇప్పుడు ఆ సినిమాకి కొన‌సాగింపుగా, వైఎస్‌ఆర్ త‌న‌యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెర‌కెక్కిస్తున్నారు. యాత్ర’ సినిమాను ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక సినిమాలోని వైఎస్ భారతి లుక్ చూసి నిజంగానే ఆమె లుక్ అచ్చుగుద్దినట్టు వైఎస్ భారతిని పోలినట్టే ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. నిజమేన్నా, మా ఇంట్లో ఆడవాళ్ళకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడ్డం కూడా నేర్పించలేదు. అంటూ ఆమె పలుకుతున్నట్లు ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా వాడారు.