ఒకప్పుడు హీరోలు, హీరోయిన్లు బయటకి వస్తే సోషల్ మీడియాలో వారి ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యేవి. ఈ ట్రెండ్ కాస్త మారి ఏ సెలబ్రిటీ బయటకి వచ్చినా, ఎవరి ఫోటో వైరల్ అయినా వెంటనే అతను/ఆమె వేసుకున్న డ్రెస్ ఏ బ్రాండ్? ఏ బ్రాండ్ వాచ్ పెట్టుకున్నారు? దాని ధర ఎంత? ఏ బ్రాండ్ షూ వేసుకున్నారు? అంటూ వెతికి మరీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అలాంటి వార్తల్లో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది, అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించినది కావడం విశేషం. ఎన్టీఆర్ పెట్టుకునే వాచ్ లు తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంటాయి. ఎన్టీఆర్ కనిపించినప్పుడల్లా.. అతని చేతికి ఏ వాచ్ ఉన్నా అది హైలెట్ అవుతునే ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు కోట్ల రూపాయల విలువ చేసే వాచీలు ఎన్టీఆర్ చేతికి చూశాం. అయితే ఈసారి మాత్రం అంతకుమించి అనేలా ఎన్టీఆర్ వాచ్ హైలైట్ అవుతోంది. రీసెంట్‌గా అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్, ఎన్టీఆర్ తన ఇంట్లో అరేంజ్ చేసిన పార్టీ వచ్చాడు. ఈ పార్టికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు తారక్. అయితే.. ఇందులో యంగ్ టైగర్ చేతికున్న వాచ్ పై అందరి దృష్టి పడింది.
చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్న ఆ వాచ్ రేట్ చూస్తే ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోతుంది. రిచార్డ్ మిల్లే బ్రాండ్‌కు చెందిన ఈ మెక్‌క్లారెన్ ఎడిషన్ వాచ్ విలువ అక్షరాల 8 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. ప్రపంచంలో మోస్ట్ కాస్ట్‌లీ వాచీలలో రిచర్డ్ మిల్లే బ్రాండ్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ బ్రండ్ వాచ్ రేట్లు.. మినిమమ్ కోటి రూపాయల నుంచి ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఈ వాచీలు వాడుతున్నారు. వారిలో యంగ్ టైగర్ కూడా ఒకడు. తారక్ పెట్టుకున్నా వాచ్ ధర 8 కోట్ల అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సరికి అంతా షాక్ అవుతున్నారు. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్‌లో.. ఒక్క పవన్ కళ్యాణ్ వాచ్ కొట్టేస్తే చాలు, లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుందనే డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వాచ్ రేట్ తెలియడంతో అందరి మైండ్‌లోను ఇదే రన్ అవడం గ్యారెంటీ. ఏదేమైనా తారక్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి!
