Site icon NTV Telugu

NTR: దేవర దుబాయ్ ట్రిప్ అందుకేనా?

Ntr

Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు అనేక కారణాల వలన గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా దేవర షూటింగ్ స్పాట్ నుంచి అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోని ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ #Devara #ManofMasses టాగ్స్ వైరల్ చేస్తున్నారు. దేవర జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫోటోస్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చి మరింత ఆనందాన్ని ఇచ్చాయి. ఫ్యామిలీతో దుబాయ్ వెళ్తున్నాడు ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు అరెస్ట్, తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ సపోర్ట్ కోరుకోవడం లాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్ ఎందుకు వెళ్తున్నాడు అనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ దేవర లేటెస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకోని దుబాయ్ లో జరగనున్న ‘సైమా’ ఈవెంట్ కి అటెండ్ అవ్వడానికి ఫ్యామిలీతో వెళ్లాడు. సెప్టెంబర్ 15-16 డేట్స్ లో సైమా ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది.

ఈ ఈవెంట్ లో బెస్ట్ యాక్టర్ తెలుగు కేటగిరిలో ఎన్టీఆర్… రామ్ చరణ్, నిఖిల్ సిద్దార్థ్, సిద్ధూ జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్, అడవి శేష్ లతో పోటీ పడుతున్నాడు. కార్తికేయ 2 సినిమాకి గాను నిఖిల్, సీతారామం సినిమాకి దుల్కర్ సల్మాన్, డీజే టిల్లు సినిమాకి సిద్ధూ జొన్నలగడ్డ, మేజర్ సినిమాకి అడవి శేష్, ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఎన్టీఆర్-రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ తెలుగు కేటగిరిలో పోటీ పడుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ కి దుల్కర్ సల్మాన్, రామ్ చరణ్ నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదురుకానుంది. మేజర్ సినిమాలో అడవి శేష్ కూడా సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి బెస్ట్ యాక్టర్ అవార్డుకి శేష్ కూడా స్ట్రాంగ్ కంటెండర్ గా కనిపిస్తున్నాడు. మరి వీరిని దాటి ఎన్టీఆర్ సైమా అవార్డుని గెలుచుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version