NTV Telugu Site icon

NTR Devara: సముద్రగర్భంలో యుద్ధం… యంగ్ టైగర్ సిద్ధం!

Devara Shooting Update

Devara Shooting Update

ఎట్టిపరిస్థితుల్లోను నవంబర్ వరకు దేవర షూటింగ్ కంప్లీట్ చేసి… నెక్స్ట్ వార్ 2లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే నాన్ స్టాప్‌ షెడ్యూల్‌తో దూసుకుపోతోంది దేవర సినిమా షూటింగ్. ఫస్ట్ టైం బౌండరీస్ దాటి పాన్ ఇండియా రేంజ్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా దేవరను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేసిన కొరటాల… షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మూడున్నర నెలల్లోనే నాలుగు మేజర్ షెడ్యూల్స్‌ని జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేసాడు. ఈ లెక్కన కొరటాల శివ ఎంత పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు.

ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుధ్దంలా డిజైన్ చేస్తున్నాడు కొరటాల. దేవర యాక్షన్ ఎపిసోడ్స్‌ గురించి ఎలాంటా అప్డేట్ బయటికొచ్చినా… ఆ హైని తట్టుకోలేకపోతున్నారు నందమూరి ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్‌ కోసం తారక్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ముంబాయి నుంచి వచ్చిన ట్రైనర్ల నెపథ్యంలో సముద్ర గర్భంలో యుద్ధానికి ప్రీపెర్ అవుతున్నాడట ఎన్టీఆర్. దీంతో దేవర పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. పైగా అన్ని పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లే కాబట్టి… దేవర థియేటర్లోకి రావడమే ఆలస్యం బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయ్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్‌కు రెడీ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా… సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మరి జనతా గ్యారేజ్‌తో రీజనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల… పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.