యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. శిరస్సు వంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా” అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. తారక్ ని అతి దగ్గర నుంచి చూసిన ఫాన్స్ సోషల్ మీడియాలో ఫోటోలతో హల్చల్ చేస్తున్నారు. తమ అన్నని చూసాం అంటూ ఫాన్స్ మీట్ నుంచి ఫోటోస్ ని పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ ఫాన్స్ మీట్ కి వెళ్లడం కన్నా ముందు ఒక టీ-షర్ట్ వేసుకున్న ఫోటోని ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఎన్టీఆర్, పులి బొమ్మతో కనిపించాడు.
Read Also: Rana: 20 నిముషాలు టైం ఇస్తే ఎన్టీఆర్ చైనీస్ భాష కూడా మాట్లాడగలడు
యంగ్ టైగర్, టైగర్ టీషర్ట్ వేసుకున్న ఫోటో ఇంటర్నెట్ లో హావోక్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫాన్స్ మీట్ ని ఇప్పటివరకూ పెట్టలేదు. ఇక్కడి ఫాన్స్ ని ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో కలవడం తప్ప ఎన్టీఆర్ నేరుగా అభిమానులని కలవలేదు. ఫారిన్ ఫాన్స్ కి మాత్రం ఆ ఛాన్స్ దొరికేసింది. అభిమానుల గురించి ఎప్పుడూ ఎమోషనల్ గా మాట్లాడే ఎన్టీఆర్, ఫారిన్ లో కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అని చెప్పాడు. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ చిత్ర మేజర్ కాస్ట్ అండ్ క్రూ ఇప్పుడు యుఎస్ లో ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. మార్చ్ 12న ఆస్కార్స్ అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి ఆరోజు జక్కన్న అండ్ టీమ్ ఇండియన్ సినిమా జెండాని వెస్ట్రన్ గడ్డపై ఎగరేస్తారేమో చూడాలి.