ఎవరాబ్బ సొత్తు కాదురా టాలెంట్ అని ఫ్రూవ్ చేసుకుంటున్నారు కొంత మంది యంగ్ స్టర్స్. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తామేంటో నిరూపించుకుంటున్నారు. వారిలో ఒకరు కంపోజర్ సాయి అభ్యంకర్. టీనేజ్ లోనే ప్రైవేట్ సాంగ్స్ తో ర్యాంప్ ఆడించాడు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ కచ్చి సెరా, ఆసా కూడా సాంగ్స్. ఈ పాటలు ఒకదాన్ని మించి ఒకటి ఉండటంతో యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి
ఎట్ ప్రెజెంట్ కచ్చి సెరా 207 మిలియన్ వ్యూస్ రాబట్టుకొంటే ఆసా కూడా 210 ప్లస్ మిలియన్స్ తో దూసుకెళుతోంది.
Also Read : Samantha : బాలీవుడ్ హీరోతో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్
ఇదిలా ఉంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మరో సింగిల్‌తో వచ్చాడు. సితిర పుతిరి అంటూ సాగిపోయే సాంగ్ కూడా యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. చక చకా మిలియన్ ఆఫ్ వ్యూస్ క్రాస్ చేసేస్తోంది. సరికొత్త కాన్సెప్టుతో వచ్చిన ఈ ప్రైవేట్ సాంగ్ లో మీనాక్షి చౌదరి మహారాణిగా మెస్మరైజ్ చేసింది. ఈ సింగిల్ కూడా యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సూర్య కల్ట్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న సూర్య 45కి మ్యూజిక్ అందించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేశాడు సాయి అభ్యంకర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సూర్య భారీ బడ్జెట్ చిత్రం కంగువా ఎన్ని విమర్శలు ఎదుర్కొందో అందరికీ తెలుసు. ఇప్పుడు సింగిల్ హిట్ కొట్టడం సూర్య 45 మ్యూజిక్ విషయంలో సేఫ్ హ్యాండ్ లో ఉందంటూ చర్చించుకుంటున్నారు. యాక్చువల్లీ ఈ ప్రాజెక్టుకు ఫస్ట్ చాయిస్ సాయి కాదు ఏఆర్ రెహమాన్ బిజీ షెడ్యూల్ వల్ల తప్పుకోవడంతో ఈ ప్లేసులోకి రీప్లేస్ అయ్యాడు. అంతకు ముందే లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న బెంజ్ కు మ్యూజిక్ అందించే ఆఫర్ అందుకున్నాడు.