Sreeleela: యంగ్ హీరోయిన్ కి కూడా కటౌట్ పెట్టేసారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన నటించే హీరోయిన్స్ కి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పెద్ద స్కోప్ ఉండదు. తెరపై హీరోనే ఎక్కువ కనిపిస్తాడు, హీరోయిన్ స్క్రీన్ టైం చాలా తక్కువ. ఉన్నంతలోనే గ్లామర్ షో, సాంగ్స్, రెండు మూడు డైలాగులు చెప్పేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి. దాదాపు అందరి హీరోయిన్స్ కథ ఇదే, అయితే ఎక్కడో కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా… కమర్షియల్ సినిమాల్లో నటించినా కూడా తమకంటూ స్పెషల్ క్రేజ్ ని సొంతం చేసుకుంటారు. సౌందర్య, విజయశాంతి, అనుష్క, సమంతా, నయనతార లాంటి హీరోయిన్స్ హీరోల పక్కన నటిస్తూనే తమకంటూ సొంత ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నారు. హీరోలతో సంబంధం లేకుండా మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు. వీరిలో ఎవరి సినిమా రిలీజ్ అయినా థియేటర్స్ దగ్గర కటౌట్స్ పెట్టి ఫాన్స్ హల్చల్ చేస్తూ ఉంటారు. అయితే అనుష్క, సమంతా, నయనతార లాంటి హీరోయిన్స్ ని కటౌట్స్ పెట్టడానికి చాలా ఏళ్ల టైం పట్టింది. యంగ్ హీరోయిన్ శ్రీలీల మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.
పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ‘శ్రీలీల’ అతి తక్కువ కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ కన్నడ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ధమాకా’. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ కి మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో ఫాన్స్ కటౌట్స్ పెట్టి సందడి చేస్తున్నారు. అయితే బెంగుళూరులోని ‘భూమిక థియేటర్’ దగ్గర రవితేజతో పాటు శ్రీలీల ఉన్న కటౌట్ ని కూడా పెట్టారు. తెలుగులో నటించిన రెండో సినిమాకే ఒక కటౌట్ లో రవితేజ లాంటి మాస్ హీరో పక్కన నిలబడే రేంజుకి వెళ్లింది అంటే రాబోయే రోజుల్లో శ్రీలీలా లేడీ సూపర్ స్టార్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
MassMaharaja @RaviTeja_offl 's #Dhamaka Mass Cutout at
Bangalore Bhumika Theatre💥#DhamakaFromDec23Book your 🎫 https://t.co/iZ40p9tVxq@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada @sujithkolli @AAArtsOfficial pic.twitter.com/6VbkqCERVQ
— People Media Factory (@peoplemediafcy) December 22, 2022
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!