Site icon NTV Telugu

Sharwanand: ఘనంగా జరిగిన శర్వా పెళ్లి…

Sharwa

Sharwa

యంగ్ హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేసి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసాడు. ఈ వేడుకలు 2 రోజులపాటు అట్టహాసంగా వేడుకలు జరిగిన తర్వాత రక్షిత రెడ్డిని జూన్ 3 రాత్రి 11 గంటలకి రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా వివాహం చేసుకున్నాడు. స్టార్ హీరో రామ్ చరణ్- సిద్ధార్థ్- నిర్మాత వంశీలు ఈ వెడ్డింగ్ కి అటెండ్ అయ్యారు. శర్వానంద్-రక్షితల కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఈ పెళ్లికి హాజరయ్యారు. వెడ్డింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకుంటున్న ఆనందం శర్వాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పుడే కాదు హల్దీ ఫంక్షన్ లో కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో శర్వా, స్నేహితులని వదలకుండా పసుపు పూస్తూ కనిపించాడు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ జూన్ 9న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ రిసెప్షన్ కి తెలుగు ఇండస్ట్రీ వర్గాలు అటెండ్ అవ్వనున్నారు.

Read Also: Adipurush: రాముడి కోసం తిరుపతికే అయోధ్య…

Exit mobile version