కోలీవుడ్ యంగ్ హీరో మణికందన్ హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి జోష్ మీదున్నాడు. గుడ్ నైట్, లవర్, కుటుంబస్తాన్ చిత్రాలు మణి పేరు కోలీవుడ్‌లో మార్మోగిపోయేలా చేస్తున్నాయి. అతడికి లక్కీ లేడీలుగా మారిపోయారు టాలీవుడ్ హీరోయిన్స్. మణి లాస్ట్ టూ ఫిల్మ్స్ హిట్స్ వెనుక ఇద్దరు తెలుగుమ్మాయిలు ఉన్నారు. ఆ ఇద్దరే శ్రీ గౌరీ ప్రియ అండ్ శాన్వీ మేఘన. ఈ ఇద్దరు పదాహరణాల తెలుగింటి ఆడపడుచులు.2013 నుండే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మణికందన్ కు ఫేమ్ తెచ్చింది జై భీమ్. కానీ హీరోగా లైఫ్ ఇచ్చింది గుడ్ నైట్. ఆ తర్వాత చేసిన లవర్ అతడి రేంజ్ మార్చేసింది.
Also Read : Trvikram : ఆదిపురుష్ ఓ లెస్సన్‌గా తీసుకుంటారా..?
ఇందులో తెలుగుమ్మాయి శ్రీ గౌరీ ప్రియ నటించింది. కెరీర్ స్టార్టింగ్‌లో అన్ క్రెడిట్ రోల్స్ చేసిన గౌరీ ప్రియకు ఐటెంటినీ ఇచ్చిన మూవీ ‘రైటర్ పద్మభూషణ్’. ఇదే ఆమెకు ‘మ్యాడ్’లో నటించే ఛాన్స్ అందించింది. ‘ట్రూలవర్’తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రియుడు మణికందన్ చేతిలో హింసకు గురౌతున్న ప్రియురాలి క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. విమర్శకుల ప్రశంలే కాదు కలెక్షన్ల పరంగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రియకు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి మార్కులు దక్కాయి. ఇక మణికందన్ రీసెంట్ హిట్ కుడుంబస్తాన్ హీరోయిన్‌గా చేసిన తెలుగుమ్మాయి శాన్వీ మేఘన. ‘పిట్టకథలు’లో రాములుగా నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత పుష్పక విమానం, ప్రేమ విమానం లాంటి సినిమాల్లో మంచి మార్కులు వేయించుకుంది. కుడుంబస్తాన్‌తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి డీసెంట్ హిట్ అందుకుంది. తమిళ హీరోకు హ్యాట్రిక్ అందించిన హీరోయిన్ అయిపోయింది. ఇలా టాలీవుడ్ ముద్దుగుమ్మలతో ఆడిపాడి హిట్స్ అందుకున్నాడు మణికందన్. ఈ సెంటిమెంట్ కాస్త మైండ్‌లో పెట్టుకుని తన నెక్ట్స్ సినిమాకు మరో తెలుగుమ్మాయికి మణికందన్ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి..