Site icon NTV Telugu

Yogi Babu: ఫేస్ బుక్ లవ్.. సినీ ఫక్కీలో తమ్ముడికి సీక్రెట్ గా పెళ్లి చేసిన టాప్ కమెడియన్

Yogibabu Brother Marriage

Yogibabu Brother Marriage

Yogi Babu Brother Secret Marriage: తమిళ చిత్రసీమలో బాగా కష్టపడి ఎదుగుతున్న ప్రముఖ హాస్య నటుల్లో యోగి బాబు ఒకరు. కమెడియన్ గానే కాకుండా కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాను కథానాయకుడిగా నటించిన చిత్రాలకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చినా.. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే కథానాయకుడిగా నటిస్తానని చెబుతూ ఇతర చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటిస్తున్నాడు. అయితే అవకాశాల కోసం వెతుకుంటున్న రోజుల్లో భోజనానికి కూడా ఇబ్బంది పడిన ఆయన నేడు చెన్నైలోనే చాలా స్థలాలు, ఇళ్లు సమకూర్చుకున్నాడు. ఇప్పుడు సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. నటుడు యోగి బాబు 2020 లో భార్గవిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతేడాది కూడా యోగి బాబు తన బిడ్డ మొదటి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో యోగి బాబు ఇంట్లో మరో విచిత్రం చోటుచేసుకుంది.

Barathiyudu 2: ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ భారతీయుడు 2 నుండి మరోపాట విడుదల..

నటుడు యోగిబాబు తమ్ముడు విజయన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మైసూర్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడట. దీంతో యోగిబాబు తన తమ్ముడి పెళ్లిని జరిపించాడు. తమిళ చిత్రసీమలో దర్శకుడిగా ఎదగాలని విజయన్‌ కష్టపడుతున్నాడు. ప్రస్తుతానికి యోగి బాబు కాల్‌షీట్స్ తో సహా అన్న పనులు అన్నీ విజయన్ చూసుకుంటున్నాడు. అతడికి ఫేస్‌బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైనట్లు సమాచారం. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమను పెంచుకున్నారు. అయితే ఆ యువతి పాదుకర్ వర్గానికి చెందినది కావడంతో పెళ్లిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో యోగి బాబు నేరుగా ఆమె కుటుంబీకులను సంప్రదించి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. జూన్ 3వ తేదీన యోగి బాబు స్వగ్రామం సెయ్యర్‌లో వీరి వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version