Site icon NTV Telugu

Yendira Ee Panchayithi: అసలు ‘ఏందిరా ఈ పంచాయితీ’?

Yendira Ee Panchayithi First Look Poster Released

Yendira Ee Panchayithi First Look Poster Released

Yendira Ee Panchayithi First Look Poster Released: డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్ గా టైటిల్ ఉంటేనే ఇప్పటి ప్రేక్షకులు సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్స్ సంగతి పక్కనపెట్టి మరీ రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలకే ఓటేస్తున్నారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో తీసే సినిమాలకంటే మన ఊరి వాతావరణంలో తీసే సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకల్ లాంగ్వేజ్, లోకల్ అడ్డాలనే తెగ ప్రేమిస్తున్నారని ఈ మధ్య రిలీజ్ అయి హిట్ అయిన సినిమాలను చూస్తే మనకి అర్ధం అవుతుంది. ఈ క్రమంలో నేటితరం ప్రేక్షకుల టేస్ట్‌కి అనుగుణంగా వీటన్నింటినీ కలగలుపుతూ తీసిన సినిమానే ‘ఏందిరా ఈ పంచాయితీ’. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ సినిమాతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది.

Prabhas Fans: సుదర్శన్ థియేటర్లో ప్రభాస్ అభిమానుల రచ్చ.. స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం!

ఊర్లో వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా కొన్ని సంకేతాలను ఇస్తూ టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మరింత ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ‘ఏందిరా ఈ పంచాయితీ’ రూపంలో ఓ కంప్లీట్ విలేజ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారని అర్ధం అవుతోంది. ఊరి చివర సహజమైన వాతావరణంలో హీరో హీరోయిన్ ఓ గోడ మీద కూర్చొని ముచ్చటించుకుంటున్న సీన్ ఫస్ట్ లుక్‌గా వదిలడంతో ఈ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ గాఢమైన ప్రేమలో అస్సలు సంబంధం లేని ఎన్నో పంచాయితీలు చోటు చేసుకుంటాయని, ఈ పంచాయితీల చుట్టే ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

Exit mobile version