NTV Telugu Site icon

Love story: వచ్చే నెల మొదటి రోజునే ‘ఏమైపోతానే’!

New Project (45)

New Project (45)

 

కొత్త నటీనటులతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు తెరకెక్కించడం ఈ మధ్య కాస్తంత ఎక్కువైంది. అలానే ఓ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు సురేశ్ కుమార్ కుసిరెడ్డి. ‘ఏమైపోతానే’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రేమకథ చిత్రంలో అమర్ లు, చాందిని పౌర్ణమి జంటగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను విజయ్ రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు పోషించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ పూర్తి కాగా యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా కి వసంత్. జి సంగీతం సమకూర్చారు. కె. వెంకటేష్ సినిమాటోగ్రాఫర్ గా చేయగా శివ శార్వాణి ఎడిటింగ్ అందించారు. ఈ సినిమా జులై 1వ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌ కుమార్ మాట్లాడుతూ, ”ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ‘ఏమైపోతావే’ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నాను. పాటలకు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ప్రీమియర్ షో కి వచ్చిన రెస్పాన్స్ కూడా మర్చిపోలేనిది. ఆరోజు అందరి స్పందన నాకు ఈ సినిమా విజయంపై మంచి కాన్ఫిడెన్స్ ను పెంచింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవే సినిమా సక్సెస్ కు కారణంగా నిలుస్తాయనే నమ్మకం ఉంది” అని అన్నారు.