విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా 70MM ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం యాత్ర. 2019లో రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. ఇందులో మలయాళ నటుడు ముమ్మట్టి ముఖ్య పాత్ర పోషించారు. కానీ ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ఈ సినిమాను నిర్మించిన 70మMM ఎంటటైన్మెంట్స్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. యాత్ర, శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ నిర్మాణసంస్థ ఏకంగా ఐదు సినిమాలను లైన్ లో పెట్టింది.
Also Read : Mega Star : బాబీ – చిరు కాంబో ఫిక్స్.. శ్రీకాంత్ ఓదెల సినిమా లేనట్టేనా.?
ఒకే సారి అయిదు సినిమాలు అనౌన్స్ చేసి, ప్రారంభించబోతోంది. స్మాల్ టు మిడ్ రేంజ్ హీరోలతో ఈ సినిమాలు ఉండబోతున్నాయి. ఆగస్ట్ రెండో వారంలో అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఆ వెంటనే షూటింగ్ కూడా చేసేలా ప్లాన్ చేస్తున్నారట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం యంగ్ హీరోలు నాగ శౌర్య, గోపీచంద్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆకాష్ పూరిలతో సినిమాలు చేయబోతున్నారట. అయితే ఈ ఐదుగురు యంగ్ హీరోలు హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలంటి వారితోనే హిట్ సినిమా తీయాలని చూస్తున్నట్టున్నారు మేకర్స్. ఈ బ్యానర్ లో సుధీర్ బాబు ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు. ముచ్చటగా మూడవసారి నటిస్తున్న ఈ బ్యానర్ లో ఈ సారైనా హిట్ కొడతాడో లేదో. కాకుంటే ఈ ఐదు సినిమాలకు దర్శకులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ బ్యానర్ లో కంటిన్యుగా సినిమాలు చేస్తున్న మహి వి రాఘవ కూడా సినిమా చేసే అవకాశం లేకపోలేదు.
