సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారిన విషయం విదితమే. ఇక సామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాల్లో ‘యశోద’ ఒకటి. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై పోస్టర్స్ తో బారి అంచనాలు రేకెత్తించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో మరిన్నీ అంచనాలు పెంచేశారు. ఫస్ట్ గ్లింప్స్ లో సమంత లుక్ అదిరిపోయింది.
హాస్పిటల్ బెడ్ పై కళ్ళు తెరిచిన సమంత .. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో కనిపించింది. బయట ప్రపంచాన్ని చూడడానికి కిటికీ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. అయితే హాసిపిటల్ బెడ్ పై సామ్ ఎందుకు ఉండాల్సి వచ్చింది..? తన చేతికి ఉన్న ఆ బ్యాండ్ ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈసారి సామ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నదని వీడియో చూస్తే అర్ధమవుతుంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో లానే ఈ చిత్రంలో కూడా సామ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టిందని టాక్ వినిపిస్తోంది. ఇక లుక్ పరంగా సామ్ కి వంక పెట్టాల్సిన పని లేదు. వైట్ కలర్ డ్రెస్ లో, అమాయకపు చూపుతో అద్భుతంగా కనిపించింది. ఇందులో కూడా సామ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సామ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
https://twitter.com/Samanthaprabhu2/status/1522088220535582723?s=20&t=cJrPOgNBR1pF2IgNmB55Qw
