కెజిఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి భాతి విజయాన్ని అందుకున్నాయి. ఇక రాఖీ భాయ్ గా యష్ నటన అద్భుతం. ఈ ఒక్క చిత్రంతో అంతకు ముందు యష్ నటించిన సినిమాలన్నీ మటుమాయం అయిపోయాయి. ఇక కెజిఎఫ్ 2 రిలీజ్ అయ్యి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. అయినా యష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. దీంతో అభిమానులు యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నాడు..? పాన్ ఇండియా నా.. కాదా అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం యష్ 19 వ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలోనే రానున్నదని తెలుస్తోంది.
ఇక ఈ విషయం తెల్సియడంతో అభిమానులు యష్ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ట్విట్టర్ లో ‘Yash19’ హ్యాష్ ట్యాగ్ తో పాటు ‘yash BOSS’ పేరుతో ట్రెండింగ్ చేసేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ ట్విట్టర్ ట్రెండింగ్ 1 లో ఉంది. ఇకపోతే యష్ తన తదుపరి చిత్రం కన్నడ లో తనకు ఒక హిట్ ఇచ్చిన దర్శకుడితో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
