KGF తర్వాత యశ్ నుంచి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్‌పై అంచనాలు సహజంగానే హైలో ఉంటాయి. జూన్ 4న రిలీజ్ కానున్న టాక్సిక్, దీపావళికి రిలీజ్ కానున్న రామాయణ లాంటి భారీ సినిమాలతో, కేవలం 5 నెలల గ్యాప్‌లోనే 1000 నుంచి 2000 కోట్ల రేంజ్‌లో బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తాడనే చర్చ జరుగుతోంది. కానీ, ఈ హైప్ ఎంత ఉందో, కంటెంట్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుందా? యశ్ కెరీర్‌లో పవర్‌ఫుల్ విలన్, రావణుడిగా కనిపిస్తున్న సినిమా రామాయణ. మైథాలజికల్ ప్రాజెక్ట్స్‌లో ఎపిక్ స్కేల్ మాత్రమే కాదు, కథనం, భావోద్వేగం, పాత్రల డెప్త్ కూడా చాలా కీలకం. ఇప్పటికే ఈ జానర్‌పై భారీ అంచనాలు ఉన్న టైమ్ లో, ఏ చిన్న మిస్ టేక్ అయినా నెగటివ్ టాక్ వెంటనే వస్తుంది. గ్లింప్స్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికే మిక్స్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. VFX, లుక్స్, పెర్ఫార్మెన్స్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. కార్టూనిష్, ఆర్టిఫిషియల్ అనే కామెంట్స్‌తో పాటు మరో ఆదిపురుష్ అవుతుందా?” అనే సందేహాలు కూడా వస్తున్నాయి.
Also Read : Tollywood Heroes: వైల్డ్‌గా మారుతున్న హీరోలు..ఎందుకీ మార్పు?
ఇక యశ్ హీరోగా వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ టాక్సిక్. దాదాపు 700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, KGF తర్వాత వస్తుండటంతో కంపారిజన్స్ తప్పడం లేదు. టీజర్‌లో స్టైలిష్ మేకింగ్ కనిపించినా, స్టోరీ కొత్తగా లేకపోతే అదే టెంప్లేట్ అనిపించే రిస్క్ ఉంది. టీజర్‌పై వచ్చిన విమర్శలు కూడా స్ట్రాంగానే ఉన్నాయి. బోల్డ్ సీన్స్, హింస ఎక్కువగా ఉందని, యానిమల్ స్టైల్ రిఫ్లెక్షన్ అని కామెంట్స్ వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రంఇది ఒక డార్క్, రియలిస్టిక్ వరల్డ్ అని చెబుతున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, యశ్ సేఫ్ గేమ్ ఆడటం లేదు. ఒకవైపు మైథాలజీ, మరోవైపు డార్క్ యాక్షన్ డ్రామా రెండు ఎక్స్‌ట్రీమ్ జానర్స్ ట్రై చేస్తున్నాడు. అదీ ఒక దానిలో విలన్‌గా, మరొకదానిలో హీరోగా ఇలాంటి సమయంలో విమర్శలు రావడం సహజమే. కానీ, రిస్క్ తీసుకోకుండా కొత్త హిస్టరీ క్రియేట్ చేయడం కూడా అసాధ్యం. మొత్తానికి విమర్శలు ఒక వైపు, ఎక్స్‌పెక్టేషన్స్ మరో వైపు. కానీ యశ్ ఫేజ్ మాత్రం క్లియర్‌గా కనిపిస్తోంది“సేఫ్ కాదు, బిగ్‌గా ట్రై చేయాలి” అనే మైండ్‌సెట్ తో ఉన్నాడు. ఇప్పుడు చూడాలి ఈ రిస్క్ బాక్సాఫీస్ దగ్గర రివార్డ్ అవుతుందా… లేదా రివర్స్ అవుతుందా?
