Site icon NTV Telugu

Yash 19: గీతూ మోహన్ దాస్ తో యష్ 19.. రామాయణ్ కూడా..

Yash

Yash

Yash 19: కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కన్నడ నటుడు యశ్. గతేడాది కెజిఎఫ్ 2 తో మరోసారి వచ్చి మరింత పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ రెండు పార్ట్స్ తరువాత యశ్ తన తదుపరి సినిమాను ప్రకటించిందే లేదు. ఎప్పుడెప్పుడు యశ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తాడా..? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్నిరోజులుగా యశ్.. కొత్త చిత్రంపై రూమర్స్ వస్తున్న విషయం తెల్సిందే. ఇకపోతే యశ్ తన తాజా చిత్రంపై వస్తున్న పుకార్లపై స్పందించాడు. కుటుంబ సమేతంగా తన స్వస్థలం మైసూర్‌కు వచ్చిన యశ్ మీడియాతో మాట్లాడాడు. రణబీర్ కపూర్, అలియా భట్‌తో బాలీవుడ్ సినిమాపై కూడా వివరణ ఇచ్చాడు. దక్షిణాదిలో భారీ ప్రజాదరణ ఉన్న నటుల్లో యష్ ఒకడు. ‘కెజిఎఫ్2’ తర్వాత చేయబోయే సినిమా గురించి ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే కొత్త సినిమా వివరాలను తెలియచేస్తామన్నాడు.

Bhaag Saale: కీరవాణి కొడుకు ఈసారైనా మత్తు వదిలిస్తాడా..?

నితీష్ తివారీ రామాయణ్ లో రావణ్ పాత్రను ఆఫర్ చేయగా తిరస్కరించినట్లు వస్తున్న పుకార్లను ప్రస్తావించగా.. పుకార్ల గురించి చింతించకండి అన్నాడు. అంటే ఆ బాలీవుడ్ సినిమా ఇంకా ఆన్ లోనే ఉన్నట్లు అర్థం అవుతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వంలో యష్19 ఉంటుంది. యశ్ సినిమా అంటేనే అంచనాలు అంబరాన్ని అంటుతాయి. అందుకే ఆచితూచి అడుగేస్తున్నాడు యశ్. దానికి తగ్గట్లే గీతు మోహన్‌దాస్ సినిమాని అతి త్వరలో ప్రకటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. అవి చివరి దశలో ఉన్నట్లు సమాచారం. దీనిని ఎవరు నిర్మిస్తారనే విషయంతో పాటు ఇతర వివరాలను కూడా వీలయినంత త్వరలో ప్రకటిస్తామని చెబుతున్నాడు యశ్.

Exit mobile version