Site icon NTV Telugu

Yash: ఇంతకాలం ఆగి రిస్క్ చేస్తున్న యష్.. అసలు విషయం ఏంటంటే?

Yash Taking Big Risk

Yash Taking Big Risk

Yash taking very big risk: KGF స్టార్, కన్నడ హీరో యష్ రెండే రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే కేజేఎఫ్ 2తో స్టార్ క్రేజ్ వచ్చినా ఎందుకో తన తదుపరి సినిమా అనౌన్స్ చేయడానికి మాత్రం చాలా కాలం తీసుకున్నాడు. పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత, ఆయన ఎలాంటి సినిమా చేస్తాడా అని కేవలం కన్నడ సినీ అభిమానులు మాత్రమే కాదు పాన్ యునియన్ సినీ అభిమానులు అందరూ ఆసక్తి కరంగా ఎదురు చూస్తున్నారు, అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయన ఒక సినిమాను అనౌన్స్ చేశారు. తమ అభిమాన హీరో తదుపరి చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి యష్ అభిమానులు కూడా ఆందోళన చెందారు. తాజాగా కన్నడ మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు యష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ విషయంలో చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Cyber Harassment: ఆన్‌లైన్‌లో బ్లాక్ చేసినందుకు ఆ వెబ్‌సైట్‌లో ఫోటోలు అప్‌లోడ్.. ఇలా పట్టేశారు!
యష్ తన తదుపరి సినిమా ఏంటి అనేది ఫైనల్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు, ఈ సమయంలో ఆయన తదుపరి చిత్రం గురించి అనేక పుకార్లు కూడా తెరమీదకు వచ్చాయి. ఫైనల్ గా యష్ మలయాళ మహిళా దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌తో కలిసి పని చేస్తారని మరియు ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రకటన జూలై నెలలో వెలువడుతుందని భావిస్తున్నారు. గీతు మోహన్‌దాస్ నటి, డైరెక్టర్ మలయాళంలో ఫేమస్సే కానీ ఇతర పరిశ్రమలలో ఆమె పేరు కూడా తెలియదు. యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌ను ఎలా హ్యాండిల్ చేయగలదో అనే విషయం మీద చర్చ జరుగుతోంది. KGF చాప్టర్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యష్ ఇలా ఒక మహిళా డైరెక్టర్ ను ఎంచుకోవడం వల్ల చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడని అంటున్నారు. యష్ నిర్ణయం సరైనదో కాదో కాలమే చెప్పగలదని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

Exit mobile version