Site icon NTV Telugu

Yash: మీ ఎదురు చూపుకి న్యాయం చేస్తాను… వెయిట్ చెయ్యండి…

Yash

Yash

సౌత్ లో కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా బయటకి వచ్చిన హీరో ‘యష్’. KGF సీరీస్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన యష్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకడు. రాఖీ భాయ్ అనే క్యారెక్టర్ ని తన స్టైల్ అండ్ స్వాగ్ తో పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన యష్, నెక్స్ట్ సినిమా ఎవరితో చేయ్యబోతున్నాడో తెలుసుకోవడానికి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘మఫ్టీ’ ఫేమ్ ‘నర్తన్’ దర్శకత్వంలో యష్ సినిమా ఉంటుందని కొందరు, ప్రశాంత్ నీల్ తోనే ‘KGF 3’ చేస్తాడని మరికొందరు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని ఇంకొందరు… ఇలా యష్ నెక్స్ట్ మూవీ గురించి ఎవరికి తోచింది వాళ్లు సోషల్ మీడియాలో రాస్తున్నారు. అయితే జనవరి 8న తన పుట్టిన రోజు సంధర్భంగా యష్ నెక్స్ట్ మూవీ గురించి అఫీషియల్ అప్డేట్ వస్తుందని పాన్ ఇండియా మొత్తం అనుకుంటున్న సమయంలో యష్ ఒక బాంబ్ పేల్చాడు. తన నెక్స్ట్ సినిమా అప్డేట్ చెప్పడానికి ఇంకా సమయం పడుతుంది అంటూ లెటర్ ని రిలీజ్ చేశాడు.

Read Also: Samantha: ఎన్ని రోజులు అయ్యిందో సమంతా బయట కనిపించి…

‘నా అభిమానులు – నా బలం.. ఏడాది పొడవునా, నా పుట్టినరోజున మీ ప్రేమ, ఆప్యాయతను ప్రదర్శించడం చూసి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నేను ఎప్పుడూ పుట్టినరోజుని జరుపుకోను. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆ రోజున మిమ్మల్ని కలుస్తుండడంతో.. నా పుట్టిన రోజు చాలా ప్రత్యేకంగా మారిపోయింది. నాకు నమ్మకం ఉన్నది.. నచ్చింది చేయాడానికి నేను కృషి చేస్తున్నాను. నాకు మంచిగా, పెద్దగా ఆలోచించే పవర్‌ని మీరే అందించారు. నేను మిమ్మల్ని మళ్లీ కలుసుకున్నప్పుడు.. కొన్ని వార్తలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. దానికి నాకు మరికొంత సమయం కావాలి. జనవరి 8న అది చేయడం అసంభవం అనిపిస్తుంది. అందుకే ఓపికగా, సహనంతో ఉండాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ సంవత్సరం నా పుట్టినరోజున, నేను పట్టణంలో ఉండను. అలాగే మీ అందరినీ కలవలేను. అయితే నేను మీకు వాగ్దానం చేస్తాను. మీ వెయిటింగ్‌కి సరైన జస్టిఫికేసన్ ఇస్తానని మాత్రం మాట ఇస్తున్నాను. ప్రేమతో, యష్’ అని రాసుకొచ్చాడు. ఆ పోస్టులో కన్నడతోపాటు ఇంగ్లీషులో ఉన్న నోట్‌ని యశ్ షేర్ చేశాడు. ప్రస్తుతం యష్ విడుదల చేసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో యష్ నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.

 

Exit mobile version