Yash: కెజిఎఫ్ లాంటి బిగ్గెస్ట్ హాట్ తరువాత కన్నడ స్టార్ హీరో యష్ ఏ సినిమా చేస్తున్నాడు..? ఏ బ్యానర్ లో చేస్తున్నాడు..? అనే దానిపై ఇప్పటికి చర్చ జరుగుతూనే ఉంది. కానీ, ఇప్పటివరకు యష్ మాత్రం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది లేదు. ఇక చాలా కథలు., మంచి బ్యానర్లు యష్ వద్దకు వస్తున్నా అతను మాత్రం ఆచితూచి అడుగేయాలని కొద్దిగా సమయం తీసుకుంటున్నడని సమాచారం. ఇక తాజాగా యష్ కు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే బ్రహ్మాస్త్ర తో బోల్తా పడిన కరణ్ జోహార్.. బ్రహ్మాస్త్ర 2 కోసం యష్ ను దింపాలని ప్లాన్ చేస్తున్నాడట.
పార్ట్ 1 లో శివ గా రణబీర్ కపూర్ కనిపించగా.. పార్ట్ 2 దేవ్ లో యష్ ను హీరోగా నటింపచేయాలని కరణ్ చాలా కష్టపడుతున్నాడట. ఇప్పటికే యష్ తో మాట్లాడగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. అయినా పట్టువదలని విక్రమార్కుడులా బాలీవుడ్ మొత్తం యష్ ను రంగంలోకి దింపాలని చూస్తుందని టాక్ నడుస్తోంది. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒక్క హిట్ వారికి చాలా అవసరం. దీంతో సౌత్ హీరోలలో సాలిడ్ గా ఉన్న హీరోలను నార్త్ వైపు అడుగులు పడేలా చేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ తో ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టగా.. దేవ్ తో యష్ ను కూడా లాగాలని చూస్తున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.