Site icon NTV Telugu

Yash: ఇది KGF 3 కాదు పెప్సీ యాడ్…

Yash

Yash

రాకింగ్ స్టార్ యష్ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడు అనిపించుకునే స్థాయికి చేరాడు. రీజనల్ సినిమాగా కూడా ఎవరూ పెద్దగా కన్సిడర్ చెయ్యని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియా మొత్తం తిరిగి చూసేలా చేశాడు యష్. బాహుబలి క్రెడిట్ రాజమౌళికి ఇవ్వలా లేక ప్రభాస్ కి ఇవ్వాలా అనే డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలానే KGF క్రెడిట్ యష్ కి ఇవ్వాలా లేక ప్రశాంత్ నీల్ కి ఇవ్వాలా అనే డిస్కషన్ కూడా కన్నఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. ప్రశాంత్ నీల్ విజన్ ని మ్యాచ్ చేస్తూ, అతని డ్రీం హీరో లుక్ లో, రాఖీ భాయ్ క్యారెక్టర్ ని కంప్లీట్ గా ఓన్ చేసుకోని, తను నిజంగానే రాఖీ భాయ్ అనిపించే రేంజులో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు యష్. KFI చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ నుంచి కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా? ఏ దర్శకుడితో యష్ నెక్స్ట్ మూవీ ఉంటుంది అనే క్యురియాసిటి ప్రతి ఒక్కరిలో ఉంది.

ఆ క్యురియాసిటి మరికొన్ని రోజులు మైంటైన్ చెయ్యండి త్వరలో నెక్స్ట్ సినిమా అప్డేట్ చెప్తానని అభిమానులని యష్ ఏడాది కాలంగా వెయిట్ చేయిస్తూనే ఉన్నాడు. తాజాగా యష్ పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు, ఇందుకు సంబంధించిన యాడ్ ని రిలీజ్ చేశాడు యష్. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ అన్ని భాషల్లో సొంతగా డబ్బింగ్ చెప్పుకున్న యష్ ఈ యాడ్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. KGF లుక్స్ ని ఇంకా మైంటైన్ చేస్తున్న యష్, అదే లుక్ లో పెప్సే యాడ్ కూడా చేశాడు. ఈ అడ్వర్టైజ్మెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో యష్, KGF 3 హాష్ టాగ్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. ఒక డ్వర్టైజ్మెంట్ కే ఇలా ఉంటే యష్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version