Site icon NTV Telugu

Raviteja: యష్ ఎవరో ఆయనకే కాదు మాకు కూడా తెలియదు… అయితే ఏంటి ఇప్పుడు?

Raviteja

Raviteja

పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూస్ ఇస్తున్న రవితేజ, నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడుతూ… “యష్ సినిమాలు ఎక్కువగా చూడలేదు… అతను చాలా లక్కీ, KGF సినిమా అతనికి పడింది” అనే మాట అన్నాడు. ఈ మాటని పట్టుకోని కన్నడ యష్ ఫ్యాన్స్… యష్ లక్కీ కాదు, తను ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడు అంటూ కష్టం గురించి రవితేజకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కి అదుర్స్ పడినట్లు, రామ్ చరణ్ కి రంగస్థలం పడినట్లు, అల్లు అర్జున్ కి పుష్ప పడినట్లు, ప్రభాస్ కి బాహుబలి పడినట్లు… యష్ కి KGF లాంటి సినిమా పడింది, అలాంటి సినిమా చేయాలంటే అదృష్టం ఉండాలి, ఆ విషయంలో యష్ లక్కీ అనే సెన్స్ లో రవితేజ మాట్లాడితే దాన్ని అర్ధం చేసుకోకుండా కొందరు రవితేజపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రవితేజకే కాదు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఆడియన్స్ కి కూడా KGFకి ముందు యష్ ఎవరో తెలియదు, అతని సినిమాలు ఏ ఇండస్ట్రీ వాళ్లు ఎక్కువగా చూసి ఉండరు.

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లాంటి హీరోలు ఎప్పటినుంచో తెలుగు ఆడియన్స్ కి తెలుసు. వీళ్లు తప్ప ఇంకో హీరో మన ఆడియన్స్ కి తెలియదు. KGF సినిమాతో యష్ అండ్ ప్రశాంత్ నీల్ ఒక్కసారి పాన్ ఇండియా ఆడియన్స్ కి తెలిసారు. KGF చూసిన తర్వాత కూడా కాదు KGF చాప్టర్ 1 ప్రమోషనల్ ఈవెంట్ కి రాజమౌళి, యష్ గురించి మాట్లాడిన తర్వాతే యష్ అంటే ఎవరో అందరికీ తెలిసింది. ఆ తర్వాత KGF 1 అండ్ 2 చూసి, రాఖీ భాయ్ క్యారెక్టర్ అతను పోట్రే చేసిన విధానం చూసి ఆడియన్స్ యష్ కి కనెక్ట్ అయ్యారు. అంతేకానీ అదేదో చిరంజీవి తెలియదు, బాలకృష్ణ తెలియదు, పునీత్ రాజ్ కుమార్ తెలియదు, రజినీకాంత్ తెలియదు, కమల్ హాసన్ తెలియదు, మమ్ముట్టి-మోహన్ లాల్ లు తెలియరు అని చెప్పినట్లు యష్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. నిజంగానే మాకు, మాకే కాదు ఇండియా మొత్తానికి KGFకి ముందు యష్ ఎవరో తెలియదు. అతను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరో అయ్యి ఉండొచ్చు మాకు మాత్రం KGFతో పరిచయం అయ్యాడు, KGF హీరోగానే తెలుసు. అది యష్ ఇండెంటిటీ, ఇందులో తప్పు ఎందుకు కనిపిస్తుందో కన్నడ సినీ అభిమానులకి, యష్ ఫ్యాన్స్ కే తెలియాలి.

Exit mobile version