Site icon NTV Telugu

Yandamuri Veerendranath Release Mudu Chepala Katha poster :యండమూరి విడుదల చేసిన ‘మూడు చేపల కథ’ పోస్టర్!

Yandamuri

Yandamuri

Yandamuri Veerendranath Release Mudu Chepala Katha poster

‘సమంత’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ముఖేష్ కుమార్ తెరకెక్కించిన ద్వితీయ చిత్రం ‘మూడు చేపల కథ’. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ గా ముఖేష్ కుమార్ రూపొందిస్తున్న ‘మూడు చేపల కథ’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. యండమూరి నవలలు చదువుతూ పెరిగి, ఆయన ఇచ్చిన ప్రేరణతో రచయిత అయి దర్శకుడిగా మారిన తను దర్శకత్వం వహించిన మూవీ ఫస్ట్ లుక్ యండమూరి ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖేష్ కుమార్ పేర్కొన్నారు. ఏపీలోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తన రెండవ చిత్రాన్ని తెరకెక్కించానని ముఖేష్ తెలిపారు. ప్రముఖ ఆర్జే లక్ష్మీ పెండ్యాల,, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, దర్శకత్వ శాఖకు చెందిన గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్స్ డాక్టర్ కల్యాణ్, సుభాష్ ఘయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక భాగం షూటింగ్ అనంతపురంలో జరుపుకున్న ఈ చిత్రం పోస్టర్ ను ప్రముఖ యాంకర్ రమేష్ అనంతపురంలోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పృథ్వి, అర్షద్ షేక్, బాలాజీ, సాయినాథ్, హర్ష, రెహ్మాన్, అనంతనేని గోపాలకృష్ణ, యాంకర్ సత్తెన్న, ధీరజ అప్పాజీ, శేషు కుమార్, ముఖేష్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version