Site icon NTV Telugu

Yamadheera: క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్‌లో ‘యమధీర’.. టీజర్ చూశారా?

Yamadheera Teaser

Yamadheera Teaser

Yamadheera Teaser: కన్నడ కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ నటించిన చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ తొలి సినిమాగా ఈ సినిమాను నిర్మించారు. నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ తదితరులు కీలకపాత్రలు పోషించగా సినిమా టీజర్ ని ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ అయిన అశోక్ కుమార్ లాంచ్ చేశారు. ఈ క్రమంలో వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ…ఇది తన మొదటి చిత్రం అని, సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశానని, ప్రేక్షకులు తమని ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి యమధీర సినిమా టీజర్ లాంచ్ చేసిన తన స్నేహితుడు యాక్టర్, ప్రొడ్యూసర్ అయిన అశోక్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.

త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది అని వేదాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ… తన స్నేహితులు వేదాల శ్రీనివాస్ కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ మొదలుపెట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరిన్ని చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్ లో రావాలని ఆయన అన్నారు. కన్నడలో 90కు పైగా సినిమాల్లో నటించిన కోమల్ కుమార్ ఈ సినిమా లో కథానాయకుడిగా నటించడం విశేషం అని, క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానం లో చూపే దూకుడుని విలన్ గా చూపించే అవకాశం ఉంది అన్నారు. ఆలాగే ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం అని తెలిపారు.

Exit mobile version