Site icon NTV Telugu

Yadamma Raju: యాదమ్మరాజు భార్య జాలీ జోసెఫ్.. ఛాన్స్ వస్తే.. మనిషినే తీసేస్తుందంట.. ?

Stella

Stella

Yadamma Raju: జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన యాసతో అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇక జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజుకు స్టెల్లాతో వివాహం అయ్యింది. వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టడం .. అవి వైరల్ అవ్వడంతో ఆమె కూడా ఫేమస్ అయ్యింది. ఇక భర్త గుర్తింపుతో స్టెల్లా కూడా సెలబ్రిటీగా మారిపోయింది. టీవీ షోస్ లలో ఆమెను కూడా గెస్ట్ గా పిలుస్తున్నారు. ఇక తాజాగా ఒక ఛానెల్ కు సంబంధించిన షోలో యాదమ్మ రాజు లేకుండా స్టెల్లా మాత్రమే ఈ ఈవెంట్ కు హాజరయ్యింది. ఈ షో థీమ్ తండ్రి కూతుళ్లతో ఉంది కాబట్టి.. స్టెల్లా ఆమె తండ్రి కలిసి వచ్చారు. ఇక ఈ షోకు రాధమ్మ కూతురు జంట హోస్ట్ లుగా వ్యహరించారు. ఇక ఈ షోకు రోహిణి, సౌమ్య రావు హైలైట్ గా నిలిచారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ ప్రోమోలో కామెడీ అదిరిపోయింది. ముఖ్యంగా స్టెల్లా చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. రోహిణి.. స్టెల్లా తండ్రిని మీ కూతురు ఎలాంటిది అని అడగ్గా.. ఆయన చాలా మంచిది అని చెప్పగానే.. సౌమ్య.. మొన్న యాదమ్మ రాజుకు లెగ్ విరిగింది కదా.. అని కౌంటర్ వేసింది. అందుకు స్టెల్లా.. ఛాన్స్ వస్తే లెగ్ ఎందుకు విరుస్తా.. మనిషినే తీసేస్తా అని చెప్పగానే.. రోహిణి వెంటనే.. నువ్వు జాలీ జోసెఫ్ లా ఉన్నావే అని షాక్ ఇచ్చింది. ఆరుగురు కుటుంబ సభ్యులను సైనైడ్ పెట్టి చంపిన ఆమెతో స్టెల్లాను పోల్చడం కరెక్ట్ కాదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇది కేవలం కామెడీ కోసమే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version