NTV Telugu Site icon

Yadamma Raju: వేలు తీసేశారు.. ప్రాణం పోయినట్లనిపించింది

Yadamma

Yadamma

Yadamma Raju: జబర్దస్త్ నటుడు యాదమ్మరాజుకు చిన్న యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. అతని కుడికాలుకు దెబ్బ తగిలినట్లు అతని భార్య స్టెల్లా వీడియో ద్వారా తెలిపింది. గత కొన్నిరోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న యాదమ్మరాజు.. ఒక సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. చిన్న చిన్న కామెడీ పాత్రలు చేసుకుంటూ ఉన్న యాదమ్మరాజుకు అదిరింది, జబర్దస్త్ షోలు మంచి ప్లాట్ ఫార్మ్స్ గా నిలిచాయి. ప్రస్తుతం సినిమాల్లో మంచి కామెడీ పాత్రలు చేస్తూ కమెడియన్ గా మారాడు. ఇక బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాలో యాదమ్మరాజు ఒక కీలక పాత్రలో నటించాడు. జూలై 29 న ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ఇక దెబ్బ తగిలిన కాలుతోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు యాదమ్మ రాజు. ఇప్పటివరకు అతనికి యాక్సిడెంట్ అయ్యింది అన్న విషయం తెలుసే కానీ, అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది మాత్రం తెలియలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాదమ్మరాజు ఆ విషయాన్నీ బయటపెట్టాడు.

Jawan: వందమంది అమ్మాయిలతో షారుఖ్ .. దుమ్ము దులిపేశాడు అంతే

“నేను చాయ్ తాగుదామని బయటకు వచ్చాను. అప్పుడు ఒక బైక్ స్కిడ్ అయ్యి నా కాలిమీద నుంచి వెళ్ళింది. కుడికాలు వేలు తెగిపోయింది. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు.. నా తొడభాగంలోని చర్మం తీసి నా వేలిని అతికించారు. నొప్పి తట్టుకోలేకపోయేవాడిని. ప్రాణం పోయినట్లనిపించింది. అయినా ఈ సినిమాలో నేను కూడా భాగం అయ్యాను. అందుకే ఈ ప్రమోషన్స్ కు వచ్చాను. చిత్ర బృందం వద్దు అన్నా.. ఆ బాధ్యత నా మీద ఉంది కాబట్టి వచ్చాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యాదమ్మరాజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Show comments