Site icon NTV Telugu

సురేష్ ప్రొడక్షన్స్‌ సహకారానికి సంతోషం.. థియేటర్లో కలుద్దాం

‘118’ వంటి విజ‌యవంత‌మైన సినిమా తర్వాత గుహన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో ప్ర‌యోగాత్మ‌క ‌థ్రిల్లర్ సినిమా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ వేర్‌ వై’.. దిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. జీవితంలో ఎదురైన ప్రశ్నలకు జ‌వాబుల‌ను వెతుకుతూ వెళ్లే ఓ జంట సాగించే ప్రయాణం క‌థ‌గా ఈ సినిమాను తీస్తున్నారు. ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు సినిమా ఇది.. విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజ‌ర్ కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా విడుదల ఓటీటీ/థియేటర్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే థియేటర్ లోనే కలుద్దామంటూ తెలిపారు. అంతేకాదు, సురేష్ ప్రొడక్షన్స్‌ సహకారానికి సంతోషం అంటూ వీడియో విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీతాన్ని సైమన్‌ కె కింగ్ అందిస్తున్నారు.

Exit mobile version