NTV Telugu Site icon

Sasanasabha: ‘శాసనసభ’ విలువను పెంచే కథ: రచయిత రాఘవేంద్ర రెడ్డి

Sasanasabha Movie

Sasanasabha Movie

Sasanasabha: పొలిటిక‌ల్‌ జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత సినీ జర్నలిస్ట్‌గా, పీఆర్‌ఓగా, శాటిలైట్‌ కన్స్‌ల్‌టెంట్‌గా సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన వ్యక్తి కె.రాఘవేంద్రరెడ్డి. ఆయన తన అనుభవానికి, ప్రతిభను జోడించి ‘శాసనసభ’ చిత్రం ద్వారా రచయితగా పరిచయవుతున్నాడు. ఇంద్రసేన కథానాయకుడిగా, వేణు మడికంటి దర్శకత్వంలో సప్పాని బ్రదర్స్‌ నిర్మించిన ఈ పాన్‌ ఇండియా పొలిటికల్‌ థ్రిల్లర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘శాసనసభ’ కథను రాయడానికి కారణం హీరో ఇంద్రసేన. ఆయన నాకు మంచి ఫ్రెండ్‌. మొదట్లో ‘అసెంబ్లీ’ అనే అనే వర్కింగ్‌టైటిల్‌తో ప్రారంభించాం. కథ నచ్చి సప్పని బ్రదర్స్‌ ముందుకు రావటంతో ప్రొడక్షన్‌ వాల్యూస్‌పెరిగాయి. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివి ఉండటం, పొలిటికల్ జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం కూడా ఈ కథ సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇక ‘శాసనసభ’ సినిమాకు రవిబసూర్ సంగీతం అందించడం కేవలం నిర్మాత షణ్ముగం సప్పని వల్లే సాధ్యపడింది. ఆయన నేపథ్య సంగీతం సినిమాకు లైఫ్‌ అని చెప్పాలి. ప్రస్తుత రాజకీయ సంఘటనల స్ఫూర్తిగా ఈ కథ రాశాను. శాసనసభ అంటే పవిత్రస్థలం. దానిని దేవాలయంగా భావించాలి. కానీ నేడు దాని విలువ మసకబారుతున్నట్లు అనిపించింది. అందునే ఈ తరానికి ‘శాసనసభ’ వాల్యూ తెలియచేయాలనే వుద్దేశంతో ఈ కథను రాశాను. అయితే ఏ ఒక్క రాజకీయనాయకుడిని టార్గెట్‌ చేయలేదు. రాజకీయ వ్యవస్థలోని లోటుపాట్లను డిస్కస్‌ చేశాం. ఓటు విలువ తెలియజెప్పడం కోసం చేసిన కథ. ఇందులో రాజేంద్రప్రసాద్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది.

నారాయణస్వామిగా ఓటు విలువ చెప్పే పాత్ర ఆయనది. ఇది అందరి హృదయాలను హత్తుకునే విధంగా వుంటుంది. మేం చెపాలనుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పాం. మా చిత్రం వల్ల ఒకరిద్దరు మారినా మా ప్రయత్నం సక్సెస్‌ అయినట్లే. శాసనసభ ఓ బిల్డింగ్‌, కట్టడం కాదు. అదొక పవిత్రస్థలం అని గుర్తుచేయడం మా సినిమా ముఖ్య వుద్దేశం. దర్శకుడు వేణు మడికంటి తన ప్రతిభతో చక్కగా తెరకెక్కించాడు. రచయితగా మరో పాన్‌ ఇండియా కథ తయారుచేశాను. ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ నిర్మాతలు నా కథతో యాక్షన్‌ ఇన్విస్టిగేషన్‌ థ్ల్రిలర్‌ తీస్తున్నారు. సినిమా అంతా విదేశాల్లోనే షూటింగ్‌ జరుగుతోంది. అది కాకుండా మరో క్రైమ్‌ థ్రిల్లర్‌కు కూడా కథను అందించాను అని చెబుతున్నారు. మరి రాఘవేంద్రరెడ్డి కలను ‘శాసనసభ’ ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి.