NTV Telugu Site icon

Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’ అప్పుడే ఇంట్లో అడుగుపెడతాడట

Writer

Writer

Writer Padmabhushan: కథ బావుంటే.. బడ్జెట్ తో కానీ, హీరోతో కానీ ప్రేక్షకులకు సంబంధం ఉండదు. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలే వస్తున్నాయి అని చెప్పాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కలర్ ఫోటో లాంటి చిన్న సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుహాస్. ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ అయినా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత సుహాస్ హీరోగా నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ మేకర్స్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రంలో సుహాస్ సరసన శిల్పరాజ్ నటించింది. చిన్న సినిమాగా ఫిబ్రవరి 3 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మహిళా అభిమానులు ఈ సినిమాకు నీరాజనం పట్టారు.

Anushka Shetty: ఎవడ్రా స్వీటీ రేంజ్ పడిపోయింది అంది.. వస్తుంది చూడు

ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీలో వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ డేట్ ను రిలీజ్ చేశారు. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 17 న జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఉగాది కన్నా ముందే అభిమానులకు కనుక ఇస్తున్నాం అంటూ జీ5 చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్ లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం డిజిటల్ లో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Show comments