Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పూర్తి రీమేక్ కాదంటూ క్లారిటీ ఇచ్చిన రచయిత దశరధ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయింది.పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమా తమిళ సినిమా అయిన తేరి సినిమాకు రీమేక్ అని గతంలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రచయితగా పని చేస్తున్న దశరథ్ ఈ సినిమా పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు వున్న అనుమానాలను తీర్చేసాడని సమాచారం. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన దశరథ్ తేరి సినిమా నుంచి కేవలం బేస్ లైన్ ను మాత్రమే హరీష్ శంకర్ తీసుకున్నారని పూర్తిగా సొంత కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోందని ఆయన చెప్పుకొచ్చారు.కథ పూర్తిగా ఎంతో డిఫరెంట్ గా ఉంటుందని ఆయన తెలిపారు.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. ఆ గ్లింప్స్ కు దేవిశ్రీ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతగానో అలరించింది.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పూర్తి కాగానే వరుస షూటింగ్ లతో ఎంతో బిజీ కానున్నారు. పవన్ చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పవన్ నటిస్తున్న వరుస సినిమాలు విజయం అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ టాలెంట్ వున్న యంగ్ డైరెక్టర్లు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో విభిన్నంగా ఉండే పాత్రలనీ ఎంచుకుంటున్నట్లు సమాచారం.. పవన్ కళ్యాణ్ కథలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్ట్రెయిట్ సినిమాలకు పవన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ త్వరలో మరిన్ని కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!