ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణపై చేసిన సామాన్లు కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది. ఆడవారికి బట్టలు ఎలా వేసుకోవాలో సలహాలు చెప్పనవసరం లేదని శివాజీకి కౌంటర్ ఇచ్చింది. కానీ శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు ఆయనకి సపోర్ట్ చేస్తుంటే అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇప్పుడీ వివాదంలోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు.
Also Read : Sankranthi 2025 : సంక్రాంతికి అందాల జాతర చేసేందుకు రెడీ అయిన భామలు
ఈ వివాదంపై లేటెస్ట్ గా నటి రాశి మాట్లాడుతూ ‘శివాజీ తనకు వ్యక్తిగతంగా చాలా ఏళ్ల నుండి తెలుసు, ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు కాదు. కానీ కొన్ని పదాలు మాత్రం తప్పుగా మాట్లాడారు. అందుకు శివాజీ సారీ కూడా చెప్పాడు. ఈ నేపధ్యంలోనే అనసూయా గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ నాలుగేళ్ళ క్రితం ఓ షోలో రాశి ఫలాలు అని పలకల్సిన చోట రాశీ గారి ఫలాలు అని మాట్లాడి నవ్వుకున్నారు. రాసి ఫలాలులో నేను లేను కానీ రాశి గారి ఫలాలు అంటే అందులో నేను ఉన్నాను. ఈ రోజు శివాజీ మీద వ్యాఖ్యలు చేస్తున్న ఆ యాంకర్ మరి ఆ రోజు అలా ఎలా అన్నారు. మైక్ దొరికింది కదాని ఎలా అంటే ఆలా మాట్లాడకండి అని పేరు ఎత్తకుండానే సదరు యాంకర్ కు స్ట్రాంగ్ గా ఇచ్చేసింది రాశి.
