NTV Telugu Site icon

Gutur Kaaram: కొరటాల శివతో వర్క్ చేయకముందు ఉండే మహేష్ ని చూస్తారు…

Guntur Kaaram

Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ మధ్య కాలంలో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలనే ఎక్కువగా చేస్తున్నాడు, పూర్తిగా మాస్ సినిమా చెయ్యట్లేదు అనే కామెంట్స్ అభిమానుల నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి. హిట్స్ కొట్టినా కూడా ఘట్టమనేని అభిమానులని మహేష్ సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, మహర్షి… ఈ సినిమాలు హిట్ అయ్యాయి, మహర్షి సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది అయినా కూడా మాస్ ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. నిజానికి మహేష్ ని ఇలా మార్చేసింది కొరటాల శివనే… శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో మహేష్ కి మంచి హిట్స్ ఇచ్చిన కొరటాల శివ, మహేష్ ని క్లాస్ హీరో చేసేసాడు. ఒక్కడు, పోకిరి, అతడు, బిజినెస్ మాన్ సినిమాల్లో ఉండే మహేష్ బాబు అభిమానులకి దూరం అయ్యి చాలా కాలమే అయ్యింది. అలాంటి మహేష్ బాబుని ఈ జనవరి 12న చూడబోతున్నారట.

వింటేజ్ మహేష్ బాబుని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి వస్తున్న సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సోషల్ మెసేజులు ఇవ్వకుండా కంప్లీట్ కమర్షియల్ యాంగిల్ లో కనిపిస్తాడట. ఇప్పటికే మాస్ స్ట్రైక్ వీడియోతో మహేష్ బాబు “ఏందీ అట్టా చూస్తున్నావ్ బీడీ 3Dలో కనపడుతుందా” అంటూ మాస్ డైలాగ్ చెప్పి సాలిడ్ కిక్ ఇచ్చాడు. సినిమాలో ఎలాంటి మెసేజులు లేకుండా, సోషల్ కాజ్ జానర్ లో ఉండకుండా గుంటూరు కారం రిలీజైతే చాలు… మహేష్ బీడీ తాగుతూ చూపించే మాస్ కి థియేటర్స్ దగ్గర సంక్రాంతికి వసూళ్ల వర్షం కురవడం గ్యారెంటీ.