NTV Telugu Site icon

Priya Prakash: నీ కళ్లల్లో ఉందో మైకం…

Priya Prakash

Priya Prakash

ఇప్పుడు అంటే యూత్ ని చాలా మంది క్రష్ లు ఉన్నారు కానీ అయిదేళ్ల క్రితం ఇండియా మొత్తానికి ఒకటే క్రష్ ఉండేది. ఒక చిన్న వీడియోతో అసలైన నేషనల్ క్రష్ గా ఫేమస్ అయిపొయింది ప్రియా ప్రకాష్ వారియర్. వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ, అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటిలని కూడా తనకి ఫాన్స్ గా మార్చుకుంది. ఒరు అడార్ లవ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్, ఈ సినిమాలో కన్ను కొట్టే సీన్ ఉంటుంది. ఈ సీన్ ఇండియాని మత్తులోకి తీసుకొని వెళ్ళిపోయింది. ఎంతోమంది ఐ వింక్ ని ప్రాక్టీస్ చేసారు కానీ ప్రియా ప్రకాష్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ని మ్యాచ్ చేయలేకపోయారు. ఆ సమయంలో ప్రియా ప్రకాష్ వారియర్ కి వచ్చిన పేరు చూసి కొత్త స్టార్ హీరోయిన్ వచ్చేసింది అనుకున్నారు కానీ ప్రియా ప్రకాష్ సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగట్లేదు. ఆ మధ్య హిందీలో ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమా చేసింది కానీ అది నాలుగేళ్లు అవుతున్నా రిలీజ్ కాలేదు. తెలుగులో నితిన్ తో ‘చెక్’ సినిమాలో ప్రియా ప్రకాష్ నటించింది కానీ అది కూడా ఫ్లాప్ అయ్యింది.

ప్రస్తుతం ఈ వింక్ బ్యూటీ చేతిలో ‘బ్రో’ సినిమా ఉంది. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమా హిట్ అయితే ప్రియా ప్రకాష్ కెరీర్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది లేదంటే మోడలింగ్ చేసుకుంటూ కెరీర్ ని సాగించాల్సిందే. సినిమాలు లేకున్నా ప్రియా ప్రకాష్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. దీనికి కారణం సోషల్ మీడియాలో ప్రియా పోస్ట్ చేసే ఫొటోలే. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలతో ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చే ఈ వింక్ బ్యూటీ, లేటెస్ట్ గా మోడరన్ వైట్ ట్రెండీ డ్రెస్ లో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ లో ప్రియా ప్రకాష్ కళ్లు చూస్తే చాలు ఆమెకి ఎందుకు అంత ఫాలోయింగ్ వచ్చిందో అర్థమై పోతుంది. 23 ఏళ్లకే ఇండియా అంతా తన పేరు మారుమోగి పోయేలా చేసిన హీరోయిన్ బౌన్స్ అయితే చూడాలని ఆమె ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి బ్రో సినిమా ప్రియా ప్రకాష్ వారియర్ కి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.