Site icon NTV Telugu

Will Smith: ఇండియాకు వచ్చిన విల్ స్మిత్.. కారణం అదేనా..?

Will Smith

Will Smith

హాలీవుడ్ హీరో విల్ స్మిత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లో చోటుచేసుకున్న చెంపదెబ్బ ఘటనతో స్మిత్ ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయాడు. తన భార్యను కామెంట్ చేసిన యాంకర్ పై స్టేజిపైనే చేయి చేసుకున్న విల్ స్మిత్ ఈ ఘటన తర్వాత ఎన్నో ఇబ్బందులను  ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఆస్కార్ అవార్డు వెనక్కి ఇవ్వాల్సిందిగా కమిటీ కోరినట్లు సమాచారం. ఇక ఇవన్నీ పక్కన పెడితే మూడేళ్ళ తరువాత విల్ స్మిత్ భారతదేశంలో అడుగుపెట్టాడు.

శనివారం  ఆయన ముంబయి విమానాశ్రయంలో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 2019 లో విల్ స్మిత్ ఇండియా వచ్చాడు . ఆ సమయంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి ముచ్చటించిన స్మిత్ మరోసారి ఇండియాకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందులోను ఇలాంటి సమయంలో రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే విల్ స్మిత్,  ఇషా షౌండేషన్ స్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ను కలవడానికి ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది.  ఈ ఘటన వలన విల్ స్మిత్ కొన్నిరోజులుగా విచారంగా ఉంటున్నాడట.. దీంతో సద్గురు చెంత కొంత సమయం గడిపేందుకు వచ్చారని తెలుస్తోంది. గతంలో కూడా విల్ స్మిత్.. సద్గురుకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెల్సిందే. మరి ఈసారి వెళ్ళేటప్పుడు ఈ హాలీవుడ్ హీరో బాలీవుడ్ ప్రముఖులను కలుస్తాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version