Samantha: సమంత ఏది చేసినా సంచలనమే.. ఆమె పోస్ట్ పెట్టినా.. ఆమె ట్వీట్ చేసినా.. ఆమె మాట్లాడినా.. చివరికి ఆమె మాట్లాడకపోయినా సంచలనమే. అంతలా సామ్.. ప్రేక్షకులతో దగ్గరగా ఉంటుంది. ఇక గత కొన్నిరోజులుగా మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సామ్ కొన్ని నెలల తరువాత మీడియా ముందుకు వచ్చింది. హరి -హరీష్ దర్శకత్వంలో ఆమె టైటిల్ రోల్ పోషించిన యశోద సినిమా నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అయితే ఏ హీరోయిన్ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడదు.. కానీ సామ్ అందరికంటే బిన్నం. కొంచెం కష్టమైన ప్రమోషన్స్ లో పాల్గొంటానికి సిద్ధమైంది. ఇక సుమతో మొదటి ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సామ్ కన్నీటి పర్యంతమయ్యింది.
“కెరీర్ తలచుకుంటే ఒక్కో రోజు ఇక ముందుకు వెళ్ళగలనా? అనే భయం కూడా వస్తుంది. కానీ ఇంత దూరం దాటి వచ్చాను కదా అనిపిస్తుంది. లైఫ్ లో ఎంతో మంది ఫైట్ చేసి సాధిస్తున్నారు కదా.. ప్రస్తుతానికికైతే నేను చావలేదు. నాకంటే చాలా మంది ఇతరత్రా సమస్యలతో పోరాడుతున్నారు. వాళ్ల తరహాలోనే నేను కూడా నాకొచ్చిన సమస్యపై పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకం వుంది” అంటూ కన్నీటిపర్యంతమయ్యింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే సమంత ఇన్నాళ్ల మౌనం ఇలా కన్నీటి ధారగా మారిందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త చైతన్య తో విడిపోయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఆమె ఎంతో ధైర్యంగా నిలబడింది. ఎన్ని ట్రోల్స్, ఎన్ని విమర్శలు, ఇంకెన్ని నిందలు అన్నింటిని ఒక్కత్తే ఎదుర్కొంది. ఇక ఈ వ్యాధితో సతమతమవుతున్న ఆమె కంట నీరు పెట్టుకోవడంతో సామ్ ఒంటరిని అనే బాధలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పుకొస్తున్నారు. ఆమె మాటలు అలాంటి అర్ధం వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో తోడుగా ఎవరైనా ఉండి ఉంటే, లేక చైతూతోనే విడాకులు తీసుకోకుండా ఉంటే ఇంత పెయిన్ వచ్చేది కాదేమో కదా అని నెటిజన్లు సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. ఇక ప్రస్తుతం సామ్ ఇప్పుడిప్పుడే కోలుకొంటుంది. త్వరలోనే ఆమె స్ట్రాంగ్ గా బయటికి వచ్చి నార్మల్ లైఫ్ లీడ్..చేస్తుందా ?ఇలాగే సైలెంట్ గా కెరీర్ పైనే ఫోకస్ చేస్తుందా..? అనేది చూడాలి.
