NTV Telugu Site icon

Ravanasura: బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుందా?

Ravanasura

Ravanasura

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. ధమాకా సినిమాతో మొదటిసార్లు వంద కోట్ల మార్క్ ని రీచ్ అయిన రవితేజ, ఆ వెంటనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో కలిసి మరోసారి వంద కోట్లు రాబట్టాడు. డిసెంబర్, జనవరి నెలల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ ఒక నెల గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ నెలలో ‘రావణాసుర’ సినిమాని రిలీజ్ చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్, శ్రీకాంత్ విస్సా స్టొరీ, భీమ్స్ మ్యూజిక్, అయిదు మంది హీరోయిన్లు, రవితేజ నెగటివ్ షెడ్… ఇన్ని ఎలిమెంట్స్ ఉండడంతో రావణాసుర సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ అంచనాలని అందుకోవడంలో రావణాసుర ఫెయిల్ అయ్యిందనే టాక్ మార్నింగ్ షో నుంచి వినిపిస్తూనే ఉంది. డివైడ్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడంతో, రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయిన ఫాన్స్ రావణాసుర సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్ళట్లేదు. అందుకే బుకింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.

దీంతో ఫస్ట్ వీకెండ్ అయ్యే సరికి రావణాసుర సినిమా ఓవరాల్ గా పది కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది. రావణాసుర ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ 25 కోట్ల వరకూ చేసింది. స్ప్ రావణాసుర సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వాలి అంటే దాదాపు ఇంకో పద్నాలుగు, పదిహేను కోట్ల వరకూ కలెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఏప్రిల్ 14న సమంతా శాకుంతలం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రావణాసుర సినిమాకి థియేటర్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి రావణాసుర సినిమా బ్రేక్ ఈవెన్ చేరే అవకాశాలు తగ్గుతాయి. కలెక్షన్స్ లో జోష్ కనిపించకపోవడంతో “కొత్తరకంగా సినిమాలు చేస్తే ఫ్లాప్ చేస్తారు… రొటీన్ సినిమాలని హిట్ చేస్తారు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రవితేజని హ్యాట్రిక్ హిట్ కొట్టనివ్వకుండా రావణాసుర ఆపేసింది.