Site icon NTV Telugu

I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ తో పైరసీ ఆగిపోతుందా..?

Ibomma Ravi

Ibomma Ravi

I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. అతని ఐ బొమ్మ, బప్పం టీవీ సైట్లు అన్నీ క్లోజ్ అయ్యాయి. మరి దీంతో టాలీవుడ్ కు అతిపెద్ద సమస్య అయిన పైరసీ ఆగుద్దా అనే చర్చలు మొదలయ్యాయి. వాస్తవానికి టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్లే జనాలు పైరసీని ఎంకరేజ్ చేయాల్సి వస్తోందనే ప్రచారం ఉంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే ఒక ఫ్యామిలీ వేలు పెట్టి సినిమా చూడలేదు కదా. ఇలాంటి టైమ్ లో ఐ బొమ్మ, బప్పం లాంటి సైట్లు ఉంటే కచ్చితంగా చూసేస్తున్నారు. ఐ-బొమ్మలో ఒక్క నెలకే 35 నుంచి 40 లక్షల మంది సినిమాలు చూస్తున్నారంటే.. థియేటర్ లో టికెట్ రేట్లు పెట్టలేకనే అని తేలిపోతోంది.

Read Also : Varanasi : మహేశ్ బాబు కామెంట్లపై చర్చ.. వారణాసి రేంజ్ వేరే లెవల్

టాలీవుడ్ కు ఐ బొమ్మ వల్ల ఇప్పటి దాకా రూ.22వేల కోట్లు నష్టం వచ్చిందని నిర్మాతలు అంటున్నారు. కానీ వ్యవస్థలో లోపాలున్నప్పుడు ప్రజలు కూడా పైరసీని ఎంకరేజ్ చేస్తారు. వేలు పెట్టి ఒక సినిమాకు వెళ్లే కన్నా.. ఐ బొమ్మ నుంచి డౌన్ లోడ్ చేసుకుని టీవీలో అందరూ చూడటం బెటర్ అనుకున్నారు. కాబట్టి టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నంత కాలం ఐ బొమ్మ కాకపోతే మరో పైరసీ సైట్ వస్తుంది. ఇదొక పెద్ద భూతం లాంటిది. దీన్ని అరికట్టాలంటే సినిమా ఇండస్ట్రీలో కూడా రేట్ల గురించి ఆలోచించాలి.

Exit mobile version