Site icon NTV Telugu

నాని సెన్సార్ టాక్ ని అధిగమిస్తాడా!?

nani

నాని నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ్ రాయ్’. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై నాని చాలా పెద్ద హోప్స్ పెట్టుకున్నాడు. 2017లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ దక్కలేదు. మధ్యలో 2019లో ‘జెర్సీ’ తో సక్సెస్ కొట్టినా కమర్షియల్ యాంగిల్ లో పెద్ద సక్సెస్ కాదు. నిర్మాతగా ‘అ’ ‘హిట్’ సినిమాలతో విజయం సాధించినా ‘కృష్ణార్జున యుద్దం, నీవెవరో, దేవదాస్, గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్’ వంట సినిమాలు నానిని బాగా నిరాశపరిచాయి. దీంతో ‘శ్యామ్ సింగ్ రాయ్’ కమర్షియల్ సక్సెస్ నానికి ఎంతో అవసరం.

Read Also : ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి

ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా చాలా స్లోగా ఉందని టాక్. అంతే కాదు చాలా వరకూ బెంగాలీ గోల ఎక్కవగా ఉందని అది తెలుగువారికి నచ్చకపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే సెన్సార్ లో అంతగా టాక్ లేని సినిమాలు థియేటర్లలో బాగా ఆడిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. ఇక నానితో పాటు సాయిపల్లవి నటనను ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. సాయిపల్లవికి గోల్డెన్ లెగ్ అనే పేరుంది. గ్లామర్ కోసం లిప్ లాక్ ఇచ్చే కృతిశెట్టి ఎలాగూ ఉంది. మరో హీరోయిన్ మడోనా సెబాస్టియన్ కూడా గ్లామర్ తారనే. ఇక దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఇచ్చి ఉన్నాడు. ఇవి అన్నీ సినిమాను నిలబెడతాయన్నది నిర్మాత నమ్మకం. అయితే ట్రైలర్ తో ఆకట్టుకున్న ‘శ్యామ్ సింగ్ రాయ్’కి ఆడియో పరంగా చార్ట్ బస్టర్స్ లేవు. మరి సెన్సార్ టాక్ అధిగమించి నిర్మాత నమ్మకాన్ని ‘శ్యామ్ సింగ్ రాయ్’ ఎంత వరకూ నిలబెడతాడో!?

Exit mobile version