NTV Telugu Site icon

కాజల్ మేనేజర్ కైనా విజయం దక్కేనా?

Will Kajal Aggarwal’s Manager Succeed?

ఇలియానా, జెనీలియా, ఛార్మి వంటి తారల మేనేజర్లకు దక్కని విజయం కాజల్ అగర్వాల్ మేనేజర్ కి దక్కుతుందా!? కాజల్ మేనేజర్… రోనీగా సుపరిచితుడైన రాన్సన్ జోసెఫ్ ఈ ‘మను చరిత్ర’ అనే సినిమాతో నిర్మాతగా మారాడు. రాజ్ కందుకూరి తనయుడు శివ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఇందులో అందరినీ ఆకట్టుకున్న అంశం కాజల్ అగర్వాల్ సమర్పించు అనే టైటిల్.

Read Also : సమంత ఆవేదన

నిజానికి కాజల్ ఎప్పుడో నిర్మాతగా పరిచయం కావలసి ఉంది. నాని తీసిన ‘ఆ’ సినిమాను హిందీలో తను ప్రొడ్యూస్ చేస్తూ రీమేక్ చేయాలని భావించింది కాజల్. అందులో లీడ్ రోల్ కూడా పోషించాలనుకుంది. అయితే ఎందుకో ఏమో అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కాజల్ సమర్పణలో ‘మను చరిత్ర’ రాబోతోంది. ఇందులో ఆమె పెట్టుబడి పెట్టిందా? లేక ఆమె పేరును ప్రచారం కోసం వాడుకుంటున్నారా? అన్న విషయంలో క్లారిటీ లేదు. నిజానికి ఈ సినిమా ఏడాది క్రితమే పూర్తయింది. అర్ధికపరమైన ఇబ్బందుల వల్ల ఇప్పటి వరకూ విడుదల కాలేదని అంటున్నారు. ఇప్పుడు విడుదల కాబోతున్న ‘మను చరిత్ర’ కాజల్ మేనేజర్ రోనీకి నిర్మాతగా బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.