Janhvi Kapoor: సాధారణంగా ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది అంటే.. అది కూడా స్టార్ హీరో సరసన కానీ, లేక వేరే భాషలో స్టార్ హీరోయిన్ కానీ అయ్యి ఉంటే .. ఆమెపైనే కొన్నిరోజులు ఫోకస్ ఉంటుంది. మొదటి సినిమా ఇంకా ఫినిష్ కూడా కాకముందే ఆమెముందు వరుస ఆఫర్లు క్యూ కడతాయి. అలా ఎంతోమంది హీరోయిన్లకు జరిగింది. ఉప్పెన రిలీజ్ కు ముందే కృతి రెండు సినిమాలకు సైన్ చేసింది.. శ్రీలీల అయితే.. సినిమా సగంలో ఉండగానే నాలుగు సినిమాలకు సైన్ చేసింది.. కేతిక శర్మ.. రొమాంటిక్ చేస్తూనే ఇంకో సినిమాకు సైన్ చేసింది.ఇక తాజాగా అందాల అతిలోక సుందరి డాటర్ జాన్వీ కపూర్ కూడా మొదటి సినిమా రిలీజ్ కన్నా ముందే అమ్మడికి తెలుగులో ఆఫర్లు తన్నుకొచ్చేస్తున్నాయి అంట. అంటే ఆమెఏమి కొత్త హీరోయిన్ కాదు.. మొదటి నుంచి కూడా ఆమెను టాలీవుడ్ రమ్మనే పిలుస్తోంది. కానీ, అమ్మడికే ఇన్నేళ్లు పట్టింది. ఎన్టీఆర్ 30 తో జాన్వీ తెలుగులోకి అడుగుపెడుతుంది. ఇక ఈ సినిమా ఇప్పుడే షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అంతలోనే చిన్నదానికి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని టాక్ నడుస్తోంది.
Harish Shankar: ఏమో అనుకున్నాం కానీ, మాస్టారూ.. మామూలోళ్లు కాదండీ బాబు మీరు
అక్కినేని వారసుడు అఖిల్.. ఈ మధ్య ఏజెంట్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చి నిరాశపర్చిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఇక ఈ సినిమా వలన అఖిల్ కొద్దిగా నిరాశ పడ్డాడే కానీ తన గమ్యాన్నివదులుకోలేదు .. ఈసారి మరింత గట్టిగా హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. అఖిల్ తన నెక్స్ట్ ఫిల్మ్.. యూవీ క్రియేషన్స్ లో చేస్తున్నాడని, ఆ సినిమా కోసం ధీర అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన జాన్వీ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే జాన్వితో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. ఇక ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ మనవడు తారక్ తోనే ఇంకా షూటింగ్ పూర్తికాలేదు.. అప్పుడే ఏఎన్నార్ మనవడితో జతకట్టడానికి రెడీ అయ్యిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
