Site icon NTV Telugu

Prabhas: పాన్ ఇండియా స్టార్ మరో సాలిడ్ ప్రామిస్…

Prabhas

Prabhas

ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తిరుపతిలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. ఓ పక్క వర్షం పడుతున్న లెక్క చేయకుండా… భారీ ఎత్తున ఈ వేడుకలో భాగమయ్యారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్‌కు ఆధ్యాత్మకి గురువు చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా… ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడని, ఇలాంటి మంచి మనిషికి మంచి జరగాలని అన్నారు. ఇక ప్రభాస్ మాట్లాడుతూ… తన అభిమానులకు మరోసారి సాలిడ్ ప్రామిస్ చేశాడు. గతంలో తన ఫ్యాన్స్‌కి ఇచ్చిన మాటని గుర్తు చేస్తూ… చెప్పినట్టుగానే ఇకపై ఏడాదికి రెండు, కుదిరితే మూడు సినిమాలు చేస్తానని ప్రామిస్ చేశాడు. నేను చాలా తక్కువ మాట్లాడతానని తెలుసు కానీ ఇవాళ ఇప్పటికే చాలా మాట్లాడాను. ఇక నుంచి తక్కువ మాట్లాడతాను ఎక్కువ సినిమాలు చేస్తాను, కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తాను కుదిరితే మూడు కూడా చేస్తాను. లేట్ అయితే నాకు సంబంధం లేదని అన్నాడు.

మీకు సినిమాలు కావాలా? నేను మాట్లాడటం కావాలా? తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తాను… నాకు అది బెటర్ అని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. మిగతా హీరోలు ఓ సినిమా అయిపోయాక మరో సినిమా స్టార్ట్ చేస్తున్నారు కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికే సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఆదిపురుష్‌, సలార్ సినిమాలను మూడు నెలల గ్యాప్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆ వెంటనే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ప్రాజెక్ట్ K రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ తర్వాత మారుతి సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలు అయిపోగానే సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ లైన్లో ఉంది. ఇంకొన్ని భారీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఏదేమైనా… సినిమా తర్వాత సినిమా అనకుండా భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమాలని కూడా సైమల్టేనియస్ గా షూటింగ్ జరుపుకునేలా చూసుకుంటున్న ప్రభాస్ కి హ్యాట్స్ఆఫ్ చెప్పాల్సిందే.

Exit mobile version