Chiyaan Vikram: చప్పుడు చెయ్యట్లేదు ఏంటి? మళ్లీ వాయిదానా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనే అయోమయం ప్రతి ఒక్కరిలో ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి హైటెక్నీకల్ డైరెక్టర్, విక్రమ్ లాంటి హీరో, స్టైలిష్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ… ఇన్ని ఉన్నా కూడా ధృవ నక్షత్రం సినిమా కష్టాలు మాత్రం తీరట్లేదు. ఏడేళ్ల పాటు ఈ సినిమాలు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు కానీ సినిమా మాత్రం రిలీజ్ కావట్లేదు అనేది వాస్తవం. 2017 ఆగస్ట్ లో ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ కావాల్సి ఉంది అప్పటి నుంచి వాయిదా పడుతూనే వస్తుందీ సినిమా. 2017 నుంచి 2018 ఏప్రిల్ కి వాయిదా పడిన ధృవ నక్షత్రం… ఆ తర్వాత 2018 దీపావళికి వాయిదా వేస్తున్నట్లు స్వయంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రకటించాడు. అప్పుడైనా ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ అవుతుందని అంతా భావించారు కానీ అవ్వలేదు. 2018 దీపావళికి కూడా మిస్ చేస్తూ 2019 నవంబర్ 15కి వాయిదా పడింది. ఈసారి కూడా షరామామూలే 2019, 2020, 2021, 2022లు డేట్స్ చెప్పడం వాయిదా పడడమే ఆనవాయితీగా మారింది.
ధృవ నక్షత్రం సినిమాపైన ఉన్న హైప్ తగ్గడానికి కారణం ఇలా ఇన్నిసార్లు వాయిదాలు వేయడమే. కేవలం 2023లోనే మే, జులై, అక్టోబర్, నవంబర్ 10… ఇలా నాలుగు డేట్స్ మిస్ చేసిన ధృవ నక్షత్రం సినిమా ఇప్పుడు నవంబర్ 24న రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఇక ఈసారి ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ అయిపోవడం పక్కా అనుకుంటున్న సమయంలో సడన్ గా ప్రమోషన్స్ సైలెంట్ అయిపోయాయి, పోస్టర్స్ కూడా బయటకి రావట్లేదు. దీంతో 48 గంటల్లో రిలీజ్ పెట్టుకోని మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు ఏంటి? ఈసారి కూడా ధృవ నక్షత్రం సినిమా వాయిదా పడుతుందా అనే ఆందోళనలో ఉన్నారు విక్రమ్ ఫ్యాన్స్… ఇన్నిసార్లు వాయిదా వేసే బదులు ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేసిన బాగుండు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈసారి అయినా మిస్ చేయకుండా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నక్షత్రం సినిమాని రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!