NTV Telugu Site icon

Bhola Shankar: 1988లో చివరి సినిమా.. ‘భోళాశంకర్’ చిరంజీవి ఆగస్ట్ సక్సెస్ రేటు పెంచేనా!?

Untitled Design

Untitled Design

Will Bhola Shankar Movie increaseChiranjeevi’s August success rate: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఆగస్టు 11న జనం ముందు నిలువనుంది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. అంటే ‘భోళాశంకర్’ను చిరంజీవి పుట్టినరోజు కానుకగా భావించవచ్చు. అసలు తిరకాసు అక్కడే ఉంది. అదేంటో చూద్దాం.

‘భోళాశంకర్’ పలు విధాలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే జనవరిలో పొంగల్ బరిలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేశారు. ఆ సినిమా తరువాత వస్తోన్న చిత్రం కాబట్టి ‘భోళాశంకర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఆ సినిమాపై కొన్ని అనుమానాలూ లేకపోలేదు. చిరంజీవికి ఆగస్టు నెల అచ్చిరావాలి. ఎందుకంటే అదే నెల 22న ఆయన బర్త్ డే. అయితే ఈ నెల మెగాస్టార్ చిరుకి అంతగా అచ్చిరాలేదని కొందరి మాట. చిరంజీవి మొత్తం కెరీర్లో ఇప్పటి దాకా ఆగస్టులో విడుదలైన చిత్రాల సంఖ్య 8. రాబోతోన్న ‘భోళాశంకర్’ 9వ చిత్రం.

ఆగస్టులో విడుదలైన చిరంజీవి తొలి చిత్రం ‘నకిలీ మనిషి’. ఇందులో చిరంజీవి తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. యస్.డి.లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నకిలీ మనిషి’ అంతగా ఆడలేదు. ఆ తరువాత శ్రీదేవి జోడీగా చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘రాణికాసుల రంగమ్మ’ 1981 ఆగస్టులోనే జనం ముందుకు వచ్చింది. చక్కటి ఆదరణ పొందింది. ఇక చిరంజీవి ఓ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ‘మా ఇంటి ప్రేమాయణం’ కూడా ఆగస్టులోనే విడుదలయింది. ఆ తరువాత చిరంజీవి హీరోగా రూపొందిన నవలాచిత్రం ‘ఛాలెంజ్’ 1984లో ఆగస్టు 9న విడుదలై సూపర్ హిట్ గా నిలచింది. ఇళయరాజా స్వరకల్పనతో మ్యూజికల్ హిట్ గా జనాన్ని మెప్పించింది ‘ఛాలెంజ్’.

Also Read: Free Aadhaar Update: ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌.. చివరి గడువు రేపే! తర్వాత డబ్బులు కట్టాల్సిందే

నిజం చెప్పాలంటే ఆగస్టులో విడుదలైన చిరంజీవి చిత్రాలలో ‘ఛాలెంజ్’ స్థాయి సక్సెస్ వేరే ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి. ‘ఛాలెంజ్’ గ్రాండ్ సక్సెస్ తరువాత చిరంజీవి నటించిన మరో నవలా చిత్రం ‘రక్త సిందూరం’ కూడా ఆగస్టు నెలలోనే 1985లో విడుదలయింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాతి సంవత్సరం 1986 ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజున ‘చంటబ్బాయ్’ విడుదలయింది. చిరంజీవి కెరీర్ లో ఆయన బర్త్ డేన విడుదలైన ఏకైక చిత్రంగా ‘చంట్బాయ్’ నిలచింది. ఈ సినిమా నవ్వులు పువ్వులు పూయించినా సక్సెస్ కాలేకపోయింది. ‘చంటబ్బాయ్’ పరాజయం పాలవడంతో ఓ యేడాది గ్యాప్ తో మళ్ళీ ఆగస్టు నెలలో మరో నవలా చిత్రం ‘మరణమృదంగం’తో ప్రేక్షకులను పలకరించారు చిరంజీవి. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది.

ఆపై మరో రెండేళ్ళకు ఆగస్టులో ‘కొదమసింహం’లా గర్జించారు చిరంజీవి. ఆ సినిమా మాత్రం మంచి వసూళ్ళు రాబట్టింది. చిరు కెరీర్ లో ఆగస్టులో వచ్చిన చివరి చిత్రమిదే. దాంతో ఇప్పుడు ‘భోళా శంకర్’ కూడా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి చిరంజీవి ఆగస్టు చిత్రాలలో సక్సెస్ రేటు తక్కువగా ఉన్న నేపథ్యంలో రాబోయే ‘భోళాశంకర్’ ఆ రేటును పెంచుతుందా? లేక తగ్గిస్తుందా? అన్నది చూడాలి.

Also Read: WTC Final 2023: అరుదైన ఘనత సాధించిన ఐదుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఆల్‌ ఫార్మాట్‌ సూపర్‌ స్టార్స్‌!